Tamannaah Bhatia : పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా(Tamannaah Bhatia). ఈమె అందాన్ని ఇష్టపడని వారంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. పాలరాతి శిల్పం లాంటి అందం, అద్భుతమైన నటన, చూపులు తిప్పుకోలేని డ్యాన్స్ వంటివి ఈమెకు మాత్రమే సొంతం. అయితే తమన్నా కి ఒకప్పుడు వచ్చేంత అవకాశాలు, ఇప్పుడు రావడం లేదు. ముఖ్యంగా నేటి తరం స్టార్ హీరోలు ఈమెని తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఆ సమయం లో ఏ హీరోయిన్ అయితే ట్రెండింగ్ లో ఉంటుందో, ఆ హీరోయిన్ ని తీసుకుంటున్నారు. కొత్త హీరోయిన్స్ హవా నే ఎక్కువగా ప్రస్తుతం సౌత్ లో కొనసాగుతుంది. తమన్నా కి కేవలం లేడీ ఓరియెంటెడ్ సబ్జక్ట్స్, వెబ్ సిరీస్ లు వంటివి మాత్రమే ఈమధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి.
Also Read : విజయ్ వర్మతో పెళ్ళికి తమన్నా సిద్ధం..కానీ విజయ్ రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా?
బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించిన ఈమె, ఎంత బోల్డ్ రొమాన్స్ చేసిందో మనమంతా చూసాము. నో కిస్ పాలసీ తో సౌత్ లో ఇన్నేళ్లు కొనసాగిన తమన్నా, బాలీవుడ్ కి వెళ్ళగానే ఇలా రెచ్చిపోతుందేంటీ అని ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma) తో చాలా కాలం నుండి డేటింగ్ చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్ గానే వీళ్లిద్దరికీ బ్రేకప్ జరిగింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా కూడా ఇంస్టాగ్రామ్ లో విజయ్ తో కలిసి దిగిన ఫోటోలను తొలగించి అతన్ని బ్లాక్ చేయడం తో వీళ్ళు కచ్చితంగా విడిపోయారు అనేది నిర్ధారణ అయ్యింది. తమన్నా కి విజయ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అయినప్పటికీ, విజయ్ మాత్రం అందుకు సిద్ధంగా లేకపోవడంతో వీళ్లకు బ్రేకప్ జరిగింది.
అయితే తమన్నా ఈ ఏడాది పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో ఆమె చేతిలో ఉన్నటువంటి సినిమాలన్నీ పూర్తి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇవ్వాలి కాబట్టి, కొత్త సినిమాలేవీ ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ గ్యాప్ లో మిస్ అయ్యాయి అని టాక్. ఇవి మిస్ అవ్వడం వల్ల తమన్నా కెరీర్ పై ప్రభావం పడింది. అందుకే బ్రేకప్ తర్వాత ఆమె ఇప్పుడు కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టే పనిలో ఉంది. ప్రస్తుతం ఆమె సంపత్ నంది దర్శకత్వం లో నటించిన ‘ఓదెల 2’ విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ సినిమా తర్వాత తమన్నా చేతులు ఖాళీ. కనీసం ఒక్క వెబ్ సిరీస్ కూడా ఆమె ఒప్పుకోలేదు. సరైన సమయంలో విజయ్ వర్మ తమన్నా కి గట్టిగా హ్యాండ్ ఇచ్చాడని, అతని కారణంగా తమన్నా కొంతకాలం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాలీవుడ్ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.
Also Read : ప్రియుడికి తమన్నా హ్యాండిచ్చిందా?.. హాట్ టాపిక్ గా మిల్కీ బ్యూటీ లేటెస్ట్ కామెంట్స్