Gundamma Katha: సూపర్ హిట్ విజయం సాధించిన ఈ సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గుండమ్మ కథ సినిమాకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ సినిమా టీవీలో ప్రసారం అయితే అభిమానులు ఎంతో ఇష్టంగా చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశం మాటలు, డైలాగ్స్ అవసరం లేకుండా కేవలం విజిల్స్ తోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఒక సనివేశం కేవలం విజిల్స్ మీద మాత్రమే నడుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతోపాటు సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం కీలక పాత్రలలో నటించిన క్లాసికల్ సూపర్ హిట్ సినిమా గుండమ్మ కథ. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్లకు మధ్య డైలాగ్స్ అస్సలు ఉండవు. ఈ సన్నివేశం మొత్తం కేవలం విజిల్స్ తో నడుస్తుంది. ఈ సినిమా రచయిత డివి నరసరాజు మద్రాసులోని తన ఇంట్లో కూర్చొని ఈ సన్నివేశాన్ని రాశారట. గుండమ్మ గారి ఇంట్లో ఎన్టీఆర్ పనివాడి మారు వేషంలో ఉంటారు. ఒకరోజు ఆ ఇంటికి ఎన్టీఆర్ తమ్ముడైన ఏఎన్ఆర్ తన ప్రేయసి అంటే జమున కోసం వస్తారు.
Also Read: గూస్ బంప్స్ రేపుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్, అక్కడ సడన్ గా ప్రత్యక్షం కారణం ఇదే!
ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ ని ఏఎన్ఆర్ అడుగుతాడు అని ముందుగా నరసరాజు రాసుకున్నారు. ఆయనకు ప్రేయసి బరువైన మాటలాగా అనిపించి ఇంట్లో నా పిట్ట ఉందా అని మార్చుకున్నారట. పిట్ట మరి చీప్ గా అనిపించి ఇంట్లో ఆమె ఉందా అని అర్థం వచ్చేలాగా ఏఎన్ఆర్ ఈలతో అడిగినట్లు వెంటనే ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ ఈల తోనే సమాధానం చెప్పినట్టు రచయిత రాసుకున్నారట. ఇంటికి ప్రొడక్షన్ కారు రావడంతో రచయిత ఆ పూటకి సగం సీన్ మాత్రమే రాసి స్క్రిప్టును తీసుకొని వెళ్లి విజయ స్టూడియోస్ లో ఉన్న చక్రపానికి ఇచ్చారట.
ఆ స్క్రిప్ట్ చూసిన చక్రపాణి విజిల్స్ తో సంభాషణ చాలా బాగుందని సీన్ లోని మిగిలిన భాగాన్ని కూడా విజిల్స్ తోనే కొనసాగించమని చెప్పారట. దాంతో దర్శకుడు నరసరాజు అలాగే రాసుకున్నారు. థియేటర్లలో ప్రేక్షకులు అగ్రనటుల విజిల్స్ సీన్ చూసి తెగ ఈల లు వేశారు. అయితే కథ రాసుకునేటప్పుడు సరైన మాట దొరక్క రచయిత విజిల్స్ ని ఆశ్రయిస్తే ఆ సన్నివేశం సూపర్ హిట్ అయింది. గుండమ్మ కథ సినిమాలో ఎస్వీఆర్ పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేరు.