Tamannaah Bhatia: తమన్నా పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. లాంగ్ టర్మ్ స్టార్డం అనుభవించిన ఈ తరం హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. టాలీవుడ్ వేదికగా తమన్నా ఎదిగారు. హ్యాపీ డేస్, 100 % వంటి రొమాంటిక్ లవ్, యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో తమన్నాకు బ్రేక్ వచ్చింది. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్స్ తో కూడా జతకట్టింది. తమన్నాకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో మార్కెట్ ఉంది.
డిజిటల్ సిరీస్లు, సినిమాల్లో కూడా నటిస్తుంది. తమన్నా కెరీర్ ఇప్పటికీ తీరిక లేకుండా సాగుతుంది. కాగా తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2023 న్యూ ఇయర్ వేడుకలు తమన్నా-విజయ్ వర్మ కలిసి జరుపుకున్నారు. అప్పుడు ఎఫైర్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. తమన్నా మొదట్లో ఈ వార్తలను ఖండించింది. మెల్లగా.. అవును, నేను విజయ్ వర్మతో లవ్ లో ఉన్నానని కుండబద్దలు కొట్టింది .
గత రెండేళ్లుగా తమన్నా-విజయ్ వర్మ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. జంటగా విహరిస్తున్నారు. స్టార్డం కూడా తగ్గిన నేపథ్యంలో తమన్నా.. పెళ్లికి సిద్ధం అవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పెళ్లి ఎప్పుడని అడుగుతుంటే.. తమన్నా దాటవేస్తూ వచ్చింది. అయితే విజయ్ వర్మతో తమన్నా విడిపోయిందా అనే సందేహం కలుగుతుంది. తమన్నా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో.. మన ప్రేమను రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తులకు సీక్రెట్ గా ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. మీరు అందంగా కనిపించాలంటే.. మీ చుట్టూ ఉన్న వాళ్ళను అందంగా చూడటం నేర్చుకోండి” అని కామెంట్ చేసింది.
పరోక్షంగా తమన్నా ఈ కామెంట్స్ ప్రియుడు విజయ్ వర్మను ఉద్దేశించి చేసింది. ఇద్దరి మాదే విబేధాలు తలెత్తయంటూ బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. దీనిపై స్పష్టత రావాలంటే.. కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. తమన్నా-విజయ్ వర్మ.. లస్ట్ స్టోరీస్ 2, సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన MCA చిత్రంలో విజయ్ వర్మ విలన్ రోల్ చేశాడు.