https://oktelugu.com/

కుదిరితే స్టార్ తో.. లేదంటే చిన్న హీరోతో !

మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ ఎండింగ్ కి వచ్చినట్లే అనే మాటలు ఇప్పటికే ఎన్నోసార్లు వినిపించాయి. కెరీర్ పోయింది అనుకునే లోపు మళ్ళీ తన హవా చూపిస్తోంది మిల్క్ బ్యూటీ. ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి మరి అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మళ్లీ తమన్నాకి క్రేజ్ పెరుగుతోంది. ఆఫర్లు పెరుగుతున్నాయి. “గుర్తుందా శీతాకాలం” అనే సినిమాలో సత్యదేవ్ సరసన కూడా నటిస్తూ మరీ మొత్తానికి ఖాళీగా అయితే లేకుండా ఎప్పటికపుడు బిజీ బిజీగా దూసుకుపోతుంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 18, 2021 / 04:38 PM IST
    Follow us on

    మిల్క్ బ్యూటీ తమన్నా కెరీర్ ఎండింగ్ కి వచ్చినట్లే అనే మాటలు ఇప్పటికే ఎన్నోసార్లు వినిపించాయి. కెరీర్ పోయింది అనుకునే లోపు మళ్ళీ తన హవా చూపిస్తోంది మిల్క్ బ్యూటీ. ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి మరి అవకాశాలను అందుకుంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మళ్లీ తమన్నాకి క్రేజ్ పెరుగుతోంది. ఆఫర్లు పెరుగుతున్నాయి. “గుర్తుందా శీతాకాలం” అనే సినిమాలో సత్యదేవ్ సరసన కూడా నటిస్తూ మరీ మొత్తానికి ఖాళీగా అయితే లేకుండా ఎప్పటికపుడు బిజీ బిజీగా దూసుకుపోతుంది మిల్క్ బ్యూటీ.

    Also Read: రష్మికకు ముందే చూపిస్తుంటాడట !

    అలాగే వెంకటేష్ సరసన మళ్లీ “ఎఫ్ 3″లో నటించనుంది. అనిల్ రావిపూడికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నెల తర్వాత షూటింగ్ షురూ అవుతుంది. తమిళంలో కూడా ఒక పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందట. అయితే తమన్నా ఇప్పుడు బిగ్ మూవీస్ కన్నా… స్మాల్ మూవీస్ పై ఫోకస్ పెట్టింది. కాజల్ అగర్వాల్ లాగే, సీనియర్ హీరోలతో సినిమాలు చెయ్యడం, అలాగే ఇంకా క్రేజ్ రాని హీరోలతో నటించడమే అనే పాలసీని పాటిస్తోంది.

    Also Read: పెళ్లయ్యాక ఫిట్ నెస్ మర్చిపోయిన హీరోయిన్ !

    దానివల్ల అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం గోపీచంద్ సరసన “సీటిమార్” సినిమాలో కూడా హీరోయిన్ గా దర్శనం ఇవ్వనుంది. ఈ సినిమా తరువాత వరుసగా గోపీచంద్ తో మరో సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఏది ఏమైనా తమన్నా మాత్రం ఎవర్ని వదిలిపెట్టకుండా సినిమాలు చేసుకుంటూ పోతుంది. కుదిరితే స్టార్ హీరోతో.. లేదంటే.. సత్యదేవ్ లాంటి చిన్న హీరోతో. తమన్నా మాత్రం ఫుల్ బిజీ.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్