https://oktelugu.com/

రష్మికకు ముందే చూపిస్తుంటాడట !

రష్మిక మండన్నాకి విజయ్ దేవరకొండకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ ఒకేసారి స్టార్ డమ్ పొందటంతో మొత్తానికి ఇద్దరికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ రకంగా రష్మిక విజయ్ దేవరకొండతో పాటు అతని ‘ఫ్యామిలీ’కి కూడా మంచి ఫ్రెండ్ అయింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా విజయ్ ఇంటికి రష్మిక వెళ్లి వస్తోందట. అందుకే… రష్మికకి దేవరకొండ తన సినిమాల సీన్లను ముందే చూపిస్తుంటాడట. Also Read: క్రేజీ సినిమాకి ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ ! తాజాగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 18, 2021 / 04:18 PM IST
    Follow us on


    రష్మిక మండన్నాకి విజయ్ దేవరకొండకి మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరూ ఒకేసారి స్టార్ డమ్ పొందటంతో మొత్తానికి ఇద్దరికీ ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ రకంగా రష్మిక విజయ్ దేవరకొండతో పాటు అతని ‘ఫ్యామిలీ’కి కూడా మంచి ఫ్రెండ్ అయింది. హైదరాబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా విజయ్ ఇంటికి రష్మిక వెళ్లి వస్తోందట. అందుకే… రష్మికకి దేవరకొండ తన సినిమాల సీన్లను ముందే చూపిస్తుంటాడట.

    Also Read: క్రేజీ సినిమాకి ‘లైగర్’ సాలా క్రాస్ బ్రీడ్ !

    తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ… “లైగర్”. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు విడుదలైంది. పోస్టర్ చూసి రష్మిక తెగ ఎగ్జైట్ అవుతూ.. “ఈ మాస్టర్ పీస్ ని నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. థియేటర్లో గ్యారెంటీగా డాన్స్, ఈలలు వేస్తా,” అంటూ ఒక ట్వీట్ చేసింది. దానికి విజయ్ రిప్లై ఇస్తూ “నువ్వు ఆల్రెడీ కొంత చూశావు. నీతో పాటు ప్రేక్షకులు కూడా చప్పట్లు, ఈలలతో వీరంగం వేస్తారని గ్యారెంటీ ఇస్తున్నా’. అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ సినిమా ఇంకా 60 శాతం పూర్తి కావాలి. కానీ అప్పుడే రష్మిక “కొంత స్టఫ్” చూసిందంటే విజయ్ – రష్మికల మధ్య బంధం ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: పారితోషకంలోనూ ట్రెండ్ సృష్టించిన పవర్ స్టార్ !

    కాగా డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యారు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. ఫస్ట్ లుక్ అయితే సూపర్ గా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్