https://oktelugu.com/

‘ఆచార్య’లో తమన్నా ఐటమ్‌ సాంగ్!

ఖైదీ నం.150తో వెండితెరపై అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చి.. సైరా నరసింహా రెడ్డితో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలన్న కలను నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస హిట్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సెన్సిబుల్‌ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. తన నాలుగు చిత్రాలతో సూపర్ హిట్స్‌ అందుకున్న శివ.. ఐదో మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అసలే చిరంజీవి కాబట్టి.. ఆచార్యతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 15, 2020 / 06:29 PM IST
    Follow us on


    ఖైదీ నం.150తో వెండితెరపై అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చి.. సైరా నరసింహా రెడ్డితో స్వాతంత్య్ర సమరయోధుడి పాత్ర చేయాలన్న కలను నెరవేర్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరుస హిట్లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న సెన్సిబుల్‌ డైరెక్టర్ కొరటాల శివ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. తన నాలుగు చిత్రాలతో సూపర్ హిట్స్‌ అందుకున్న శివ.. ఐదో మూవీని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అసలే చిరంజీవి కాబట్టి.. ఆచార్యతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టాలని చూస్తున్నాడు. రామ్‌ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తన ప్రతి సినిమాలో సామాజిక కోణాన్ని టచ్‌ చేసే కొరటాల ఈ చిత్రంలో చిరంజీవిని రెండు విభిన్నపాత్రల్లో చూపించబోతున్నాడని సమాచారం. నక్సల్స్‌ ‌ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథలో ప్రకృతి వనరులను కాపాడుకోవడం కోసం ఒక వ్యక్తి చేసే పోరాటం ఇతివృత్తంగా సినిమా సాగుతుందని సమాచారం. దీనికి పొలిటికల్ యాంగిల్‌ కూడా యాడ్‌ చేసి పర్ఫెక్ట్ స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ ముందు వరకూ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ చేశాడు.

    చిరు ‘ఆచార్య’ ఆఫర్కు సాయి పల్లవి నో!

    హీరోయిన్‌గా తొలుత త్రిషను తీసుకున్నారు. కానీ, క్రియేటివ్‌ డిఫరెన్సెన్స్‌తో ఆమె వైదొలిగింది. దాంతో, కాజల్‌ అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారు. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత ఈ చిత్రంతో చిరు- మణిశర్మ కాంబో రిపీట్‌ కానుంది. పుష్కర కాలం తర్వాత మెగాస్టార్ మూవీకి మ్యూజిక్‌ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే ఐదు పాటలను సిద్ధం చేశాడట. ఇందులో ఒక ఐటమ్‌ సాంగ్‌ కూడా ఉందట. చిరు బాడీలాంగ్వేజ్‌, డ్యాన్స్‌ మూవెంట్స్‌కు తగ్గట్టు మంచి బాణీలు సమకూర్చాడట మణి. ఇక, ఈ సాంగ్‌లో చిరుతో కలిసి స్టెప్పులేసే అదృష్టం మిల్కీ బ్యూటీ తమన్నాను వరించిందని సమాచారం. సైరా చిత్రంలో చిరంజీవితో కలిసి నటించిన తమన్నా.. మరోసారి చిరుతో ఆడిపాడనుందని సమాచారం. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతూనే స్పెషల్ సాంగ్స్‌లోనూ దూసుకెళ్తున్న తమన్నా.. రీసెంట్‌గా మహేశ్‌ బాబు సరిలేరు నీకెవ్వరూలో ‘డాంగ్‌ డాంగ్‌’ సాంగ్‌తో అదరగొట్టింది. ఇప్పుడు ఏకంగా చిరుతో స్టెప్పులేసే చాన్స్‌ కొట్టేసిందని టాక్.