https://oktelugu.com/

మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్లో కరోనా కలకలం…?

భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వైరస్ బారిన పడుతున్న వారిలో చాలామంది త్వరగానే కోలుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. స్వయంగా తమన్నానే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. బిగ్ బీ అమితాబ్, దర్శక ధీరుడు రాజమౌళి, ఎస్బీ బాలు లాంటి సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 26, 2020 / 04:28 PM IST
    Follow us on

    భారత్ లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి బారిన సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వైరస్ బారిన పడుతున్న వారిలో చాలామంది త్వరగానే కోలుకుంటున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి తమన్నా తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. స్వయంగా తమన్నానే ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. బిగ్ బీ అమితాబ్, దర్శక ధీరుడు రాజమౌళి, ఎస్బీ బాలు లాంటి సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా ఈ జాబితాలో తమన్నా చేరింది.

    గత కొన్ని రోజుల నుంచి తమన్నా తల్లిదండ్రులలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో వాళ్లు అప్రమత్తమై వెంటనే కరోనా పరీక్షలు చేయించారు. పరీక్షల్లో తమన్నా తల్లి, తండ్రికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తమన్నాతో పాటు సిబ్బంది సైతం కరోనా పరీక్షలు చేయించుకోగా వాళ్లకు మాత్రం నెగిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. వాళ్లు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని తమన్నా పేర్కొంది.

    ప్రస్తుతం తమన్నా తల్లిదండ్రులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. తమన్నా తల్లిదండ్రులకు కరోనా నిర్ధారణ కావడం ఆమె అభిమానులను సైతం కలవరపెడుతోంది. వాళ్లు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. తమన్నా తల్లిదండ్రులు హోం ఐసోలేషన్ లో ఉండి వైద్యులచే చికిత్స చేయించుకుంటున్నారు. మరోవైపు తమన్నా నటించిన దటీజ్ మహాలక్ష్మి సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుందని తెలుస్తోంది.