Tamanna Bhatia: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా(Tamanna Bhatia). తెలుగు సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసి, తమిళం లో పాపులారిటీ ని పొంది, మళ్లీ ‘హ్యాపీ డేస్’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మన ఆడియన్స్ దృష్టిలో శాశ్వతమైన ముద్ర వేసుకుంది. పాలరాతి శిల్పం లాంటి అందంతో పాటు, అద్భుతమైన డ్యాన్స్, నటన ఉండడం తో, ప్రతీ ఏటా కొత్త హీరోయిన్స్ ఎంత మంది పుట్టుకొస్తున్నప్పటికీ తమన్నా ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా సీతారంగా కొనసాగుతూ వస్తోంది. ఒక పక్క క్రేజీ సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లతో అలరిస్తూ యూత్ ఆడియన్స్ కి అన్ని విధాలుగా దగ్గరగా ఉంది తమన్నా. అయితే ఆమె లేటెస్ట్ లుక్స్ ని చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కాస్త బొద్దుగా కనిపించిన తమన్నా, అకస్మాత్తుగా సన్నగా కనిపించడం పై సోషల్ మీడియా లో చర్చనీయాంశం అయ్యింది.
అకస్మాత్తుగా తమన్నా ఇలా సన్నబడడానికి కారణాల గురించి సోషల్ మీడియా లో చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈమధ్య కాలం లో సినీ సెలబ్రిటీలు సన్నగా మారేందుకు ‘ఒజెంపిక్’ అనే ఇంజక్షన్ ని వాడుతున్నారని, దాని వల్లే తమన్నా ఇలా సన్నబడింది అని అంటున్నారు. షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తో కలిసి ఒక వీడియో లో కనిపించింది. ఈ వీడియో లో తమన్నా కెరీర్ ప్రారంభం లో ఎంత సన్నగా ఉండేదో, అంత సన్నగా కనిపించింది. ఒక్కసారిగా ఆమెని అలా చూసి షాక్ కి గురయ్యారు ఫ్యాన్స్. దీంతో కొంతమంది ‘ఒజెంపిక్’ ఇంజక్షన్ కారణంగానే తమన్నా ఇలా అయ్యిందంటూ కామెంట్స్ చేస్తుంటే, ఆమె అభిమానులు మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని అంటున్నారు. తమన్నా ఒక ఫిట్నెస్ ఫ్రీక్ , ఎల్లప్పుడూ ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది.
ఆమెకు కావలసినప్పుడు సరైన డైటింగ్ తీసుకుంటూ వర్కౌట్స్ చేసు సన్నబడిపోతుంది, ఇది ఆమెకు కొత్తేమి కాదంటూ చెప్పుకొస్తున్నారు. ఆర్యన్ ఖాన్ తో కలిసి తమన్నా ఉన్న లేటెస్ట్ వీడియో ని మీరు కూడా చూసేయండి. ఆమెలో వచ్చిన ఈ మార్పు కచ్చితంగా మిమ్మల్ని షాక్ కి గురి చేస్తుంది. గత ఏడాది తమన్నా మన టాలీవుడ్ ఆడియన్స్ కి ‘ఓదెల 2’ అనే చిత్రం ద్వారా కనిపించింది. ఈ ఏడాది ఆమె తెలుగు ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు. కానీ హిందీ లో మాత్రం ఆమె వరుసగా 5 సినిమాలు చేస్తుంది. అందులో షాహిద్ కపూర్ హీరో గా నటించిన ‘ఓ రోమియో’ చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా తో పాటు మరియా IPS , V శాంతారాం, ది ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్, రేంజర్ వంటి చిత్రాల్లో కూడా నటిస్తుంది.
