Eesha Rebba: ఈమధ్య కాలంలో సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలపై ఉద్దేశపూర్వకంగా అతి నీచమైన భాషతో కామెంట్స్ చేసే ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు. ఒకప్పుడు సెలబ్రిటీలు చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉండేవారు. కానీ ఎంతైనా వాళ్ళు కూడా మనుషులే కదా, ఇప్పుడు అసలు సహించలేకపోతున్నారు. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ సైతం తమ వ్యక్తిగత ఫోటోలకు, పేర్లకు భద్రత కలిగించాలంటూ హై కోర్టుని ఆశ్రయిస్తున్నారు. సూపర్ స్టార్స్ పరిస్థితే అలా ఉంటే, ఇక చిన్న హీరో/ హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. రీసెంట్ గా ప్రముఖ యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా(Eesha Rebba) బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కొంతమంది సోషల్ మీడియా ఆకతాయిలపై కేసు నమోదు చేసింది.
ఇన్ స్టాగ్రామ్ యాప్ లో తానూ పెట్టిన పోస్టుల క్రింద కొందరు ఉద్దేశపూర్వకంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని, వాళ్ళని బ్లాక్ చేసినప్పటికీ కూడా వేరే ఫేక్ అకౌంట్ తో వచ్చి అతి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దయచేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేసు వేసింది. ఈమేరకు FIR నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. ఈషా రెబ్బ చాలా మంది సెలబ్రిటీలు లాగానే సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సెలబ్రిటీ. తనకు సంబంధించిన ఫోటోలు, రీల్స్ తో పాటు అప్పుడప్పుడు వర్కౌట్ వీడియోస్ ని కూడా షేర్ చేస్తూ ఉంటుంది ఈషా రెబ్బ. ఈ పోస్టుల క్రిందే కొంతమంది కామాంధులు అత్యంత నీచమైన కామెంట్స్ చేస్తూ కనిపించారు. చాలా కాలం వరకు సహనం తో ఉన్న ఈషా రెబ్బ, ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సినీ సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటో అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈషా రెబ్బా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరో గా నటించిన ఈ చిత్రం ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ, కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు . ఇకపోతే ఈషా రెబ్బ చాలా కాలం నుండి తరుణ్ భాస్కర్ తో ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈషా రెబ్బ, అచ్చ తెలుగు అమ్మాయి, తెలంగాణ ప్రాంతానికి చెందినది. ‘అరవింద సమేత’ లో నటించినప్పుడు, ఈ అమ్మాయి దశ తిరిగిపోయింది, పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతుందని అంతా అనుకున్నారు కానీ, ఇంకా మీడియం రేంజ్ లోనే కొనసాగుతుంది.