‘కేజీఎఫ్ 2’.. యావత్తు మాస్ ప్రేక్షక లోకం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న క్రేజీ పాన్ ఇండియా సినిమా. అయితే, ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో మిల్క్ బ్యూటీ తమన్నా ఒక ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఆమెది స్పై లాంటి పాత్ర. ఫస్ట్ పార్ట్ లో ఓ స్పెషల్ సాంగ్ లో అలరించిన తమన్నా.. సెకండ్ పార్ట్ లో మాత్రం యాక్షన్ సీన్స్ కూడా చేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా తమన్నానే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక దక్షిణాది పాన్ ఇండియా సినిమాలలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమానే భారీ విజయం సాధించింది. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ను నేషనల్ స్టార్ ను చేసింది. అందుకే కెజిఎఫ్ 2 చిత్రంపై ప్రేక్షకులలో ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అన్ని పరిశ్రమల్లో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొని ఉండటంతో ఈ సినిమా ఓపెనింగ్స్ తో సరికొత్త రికార్డ్స్ సృష్టించడం ఖాయం అంటున్నారు.
అన్నట్టు కెజిఎఫ్ 2 గత ఏడాది అక్టోబర్ లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ వలన షూటింగ్ వాయిదా పడిన నేపథ్యంలో ఆలస్యం అవ్వడం, ఆ తరువాత ఈ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తే.. కరోనా సెకెండ్ వేవ్ వచ్చి రిలీజ్ ను మళ్ళీ ఆపడంతో.. మొత్తానికి ఈ సినిమా దాదాపు రెండేళ్లు నుండి వాయిదా పడుతూనే వస్తోంది. కానీ ఆగస్టులో ఈ సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కాగా కెజిఎఫ్ 2 లో మెయిన్ విలన్ అధీరా పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నారు. యష్ ని ఎదుర్కొనే విలన్ గా ఈ బాలీవుడ్ నటుడు ఎలా ఉంటాడో చూడాలి. అలాగే రవీనా టాండన్, ప్రకాష్ రాజ్ వంటి నటులు కూడా కీలక రోల్స్ చేస్తున్నారు. అందుకే మొదటి భాగానికి మించి అనేక ప్రత్యేకతలు కెజిఎఫ్ 2లో ఉన్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read More