
‘ఆర్ఆర్ఆర్’.. బాహుబలి తర్వాత జక్కన్న చెక్కుతున్న ఈ మూవీ మీద దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం వెచ్చించారు. ఇప్పుడు చివరి దశకు వచ్చిన ఈ సినిమా షూటింగ్ మరో 20 రోజులు మాత్రమే ఉందట..
అయితే ఆర్ఆర్ ఆర్ మూవీ షూటింగ్ తోనే పూర్తయినట్టు కాదు లెక్క. ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ లో ఉందట.. ఎంతలేదన్నా కనీసం ఐదారు నెలల సమయం పడుతుంది. సంక్రాంతి వరకు రెడీ అవుతుంది.
అయితే భారీ బడ్జెట్ సినిమాకు ఈ టికెట్లతో అమ్మితే అస్సలు వర్కవుట్ కాదు. అందుకే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును కల్పించాకే ఆర్ఆర్ఆర్ మూవీని రిలీజ్ చేసే అవకాశాలుంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలోని ఇద్దరు హీరోలను రెండున్నరేళ్ల తర్వాత రిలీజ్ చేయబోతున్నాడట.. ఎన్టీఆర్, రాంచరణ్ లను ఆగస్టు నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేయడానికి రాజమౌళి నిర్ణయించి వారికి క్లారిటీ ఇచ్చేశాడట.. ఆగస్టునుంచి ఎన్టీఆర్ అగ్ర దర్శకుడు కొరటాల శివ సినిమా మీదకు వెళ్తారని తెలుస్తోంది.
రాంచరణ్ నెక్ట్స్ సినిమా డైలామాలో పడింది. తమిళ స్టార్ దర్శకుడు శంకర్ సినిమా అనౌన్స్ చేసినా ఆయన చేయాల్సిన ‘భారతీయుడు2’ మూవీ పెండింగ్ లో పడి కోర్టు కేసుల వరకు వెళ్లింది. అది పూర్తి చేశాకే రాంచరణ్ మూవీ పట్టాలెక్కనుంది.