https://oktelugu.com/

Tamanna Bhatia Marriage: పెళ్ళికి సిద్ధం అవుతున్న తమన్నా… హల్చల్ చేస్తున్న ఫోటోలు

స్టార్డం తగ్గినా తమన్నాకు ఆఫర్స్ వస్తూనే ఉంటున్నాయి. కొన్నాళ్లుగా డిజిటల్ కంటెంట్ మీద కూడా ఫోకస్ పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. అలాగే జీకార్ద టైటిల్ తో ఒక సిరీస్ చేసింది.

Written By:
  • S Reddy
  • , Updated On : January 28, 2024 / 12:20 PM IST
    Follow us on

    Tamanna Bhatia Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా థర్టీ ప్లస్ లో ఉంది. హీరోయిన్ గా కెరీర్ కూడా నెమ్మదించింది. ఆల్రెడీ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉన్న తమన్నా పెళ్ళికి సిద్ధం అవుతున్నారని సమాచారం. టాలీవుడ్ ని సుదీర్ఘ కాలం ఏలిన హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. హ్యాపీ డేస్ మూవీ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. స్టార్ హీరోల పక్కన వరుస చిత్రాలు చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, అల్లు అర్జున్… ఇలా ప్రతి స్టార్ పక్కన నటించింది. చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలతో కూడా రొమాన్స్ చేసింది.

    స్టార్డం తగ్గినా తమన్నాకు ఆఫర్స్ వస్తూనే ఉంటున్నాయి. కొన్నాళ్లుగా డిజిటల్ కంటెంట్ మీద కూడా ఫోకస్ పెట్టింది. లస్ట్ స్టోరీస్ 2లో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. అలాగే జీకార్ద టైటిల్ తో ఒక సిరీస్ చేసింది. ఈ రెండు సిరీస్లలో తమన్నా రోల్ బోల్డ్ గా ఉంటుంది. శృతి మించిన శృంగార సన్నివేశాల్లో రచ్చ చేసింది. బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై మీడియా ప్రశ్నలు వేయగా.. ఆసక్తికరంగా స్పందించింది.

    పాత్ర డిమాండ్ చేసినప్పుడు తప్పదు కదా. అయినా ఈ రోజుల్లో కూడా ముద్దు సన్నివేశాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉందని సమాధానం చెప్పింది. ఇక గత ఏడాది ప్రారంభంలో నటుడు విజయ్ వర్మతో తమన్నా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ కథనాలను తమన్నా కొట్టిపారేసింది. అనూహ్యంగా కొన్ని నెలల క్రితం విజయ్ వర్మతో తన రిలేషన్ కన్ఫర్మ్ చేసింది. లస్ట్ స్టోరీస్ 2 సెట్స్ లో తమ ప్రేమ మొదలైందని చెప్పుకొచ్చింది.

    ఈ ఏడాది విజయ్ వర్మ-తమన్నా పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని వినిపిస్తుంది. దీనికి తాజా ఘటన బలం చేకూర్చింది. తమన్నా కుటుంబ సభ్యులతో పాటు గౌహతిలో గల కామాఖ్య ఆలయాన్ని సందర్శించింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి సిద్ధం అవుతున్న తమన్నా పుణ్య క్షేత్రాలు తిరుగుతున్నారంటూ సోషల్ మీడియాలో టాక్. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది. విజయ్ వర్మ తెలుగులో ఏం సీ ఏ చిత్రంలో విలన్ గా నటించాడు.