https://oktelugu.com/

Pawan Kalyan Surender Reddy: పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ని పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?

తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేంజ్ మాత్రం సపరేట్ అనే చెప్పాలి. కెరియర్ మొదట్లో వరుసగా ఏడు హిట్లు కొట్టి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకొని 'పవర్ స్టార్' అనే ట్యాగ్ ని సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 28, 2024 / 12:16 PM IST
    Follow us on

    Pawan Kalyan Surender Reddy: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నప్పటికీ కొంత మందితో మాత్రం సినిమాలు చేయడానికి దర్శకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు.వాళ్లతో సినిమాలు చేస్తే వాళ్ల ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందనే ఒకే ఒక ఉద్దేశ్యం తో మంచి కథ రెఢీ చేసుకొని ఆ స్టార్ హీరోలతో సినిమా చేయడానికి రెడీ అవుతు ఉంటారు.

    ఇక ఇలాంటి క్రమం లోనే తెలుగులో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ రేంజ్ మాత్రం సపరేట్ అనే చెప్పాలి. కెరియర్ మొదట్లో వరుసగా ఏడు హిట్లు కొట్టి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకొని ‘పవర్ స్టార్’ అనే ట్యాగ్ ని సంపాదించుకున్నాడు. ఇక పవర్ స్టార్ ప్రస్తుతం ఇటు సినిమాలు, ఆటు పాలిటిక్స్ రెండిట్లో బిజీగా ఉంటూ తన స్టామినా ఏంటో చూపించుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన దాదాపు నాలుగు సినిమాలకు కమిటై ఉండగా ఎప్పటినుంచో సురేందర్ రెడ్డి తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటు వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిమీద ఇప్పటివరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు.

    ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ అట్లీ తో ఒక సినిమా ఉంటుందని అనౌన్స్ చేశాడు.ఇక దాని వల్ల సురేందర్ రెడ్డి మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉందంటూ ట్రేడ్ పండితులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ కి ఒక కథను వినిపించాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ దానిమీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు సురేందర్ రెడ్డి ఎవరితో సినిమా చేయాలి అనే దానిమీద చాలా రకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి ని హోల్డ్ లో పెట్టి అట్లీ ని తెరమీదకి తీసుకురావడం ఎంత వరకు కరెక్ట్ అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

    ఇక ప్రస్తుతం సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకునే పనిలో ఉన్నాడు. మరి ఆయన నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే దానిమీద క్లారిటీ అయితే లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి ఉంటే మాత్రం ఆయన ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కి మరో రెండు సంవత్సరాలు అయిన సురేందర్ రెడ్డి వెయిట్ చేయక తప్పదు. అందువల్ల ఈ రెండు సంవత్సరాల్లో ఇంకొక హీరోతో సినిమా చేయాలనే ఆలోచనలో సురేందర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది…