Venu Udugula: ఇండస్ట్రీ మొత్తం సక్సెస్ మీదే నడుస్తుంది. ఒక్క సినిమా అటు ఇటు అయితే ఎంత పెద్ద దర్శకుడికైనా ఇబ్బందులు తప్పవు. అనుమానాలు కూడా సహజమే. విరాట పర్వంకి ముందు వేణు ఊడుగుల వేరు. ఇప్పుడు వేరు. విరాట పర్వం అపజయం పాలైంది. అంత ఘోరంగా పరాజయం పాలు అవుతుందని ఎవరూ ఊహించలేదు.
దాంతో, టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఊడుగుల కి ఫైనాన్సియల్ సమస్యలు ఎక్కువయ్యాయని, శర్వానంద్ తో అనుకున్న సినిమా ఆగిపోయిందని ప్రచారం మొదలైంది.
Also Read: Akhil- Faria Abdullah: ఆ యంగ్ హీరోయిన్స్ తో అఖిల్ రొమాన్స్.. వెరీ స్పెషల్ అట
విరాట పర్వం ఫ్లాప్ కావడం కన్నా ఈ ప్రచారాలు ఆయన్ని ఎక్కువగా వేధిస్తున్నాయి. ఐతే, నిజం ఏంటంటే… వేణు ఊడుగుల, శర్వానంద్ సినిమా యథావిధిగా ప్రారంభం కానుంది.
సినిమా ఆగిపోవడం అనేది పూర్తిగా తప్పు. వేణు ఊడుగులకి శర్వానంద్ పూర్తి మద్దతుగా ఉన్నారు. టెన్షన్ పడకుండా కూల్ గా స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోమని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శర్వానంద్ . రెగ్యులర్ షూటింగ్ మాత్రం కాస్త ఆలస్యం కావొచ్చు. ఇంతకు మించి, ఈ సినిమాలో ఎటువంటి మార్పులేదు.
ఇక విరాట పర్వం వ్యాపార లావాదేవీలు, నష్టాల పూడిక వంటివి మాత్రం వేణు ఊడుగులకి కొంత తలనొప్పే. వాటిని సెట్ రైట్ చేసే పనిలో ఉన్నారు. ఐతే, ఇప్పుడు వేణు ఊడుగుల మరింత కసిగా శర్వానంద్ సినిమా తీయనున్నారట.
విరాట పర్వం సినిమా మిస్ ఫైర్ కావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. శర్వానంద్ సినిమాతో వేణు ఊడుగుల మరోసారి సక్సెస్ అయి తన స్థానాన్ని నిలబెట్టుకోవడం ఖాయం అని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.
Also Read:Actress Pragathi: ప్రగతి అందాల రచ్చ.. ఫోటోలు చూసి మతిపోతుందట !