
Heroine Taapsee: హీరోయిన్ తాప్సీకి తెగింపు ఎక్కువ. అందుకే అందరి పై విరుచుకుపడే కంగనా పైనే ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ తక్కువ కాలంలోనే హిందీలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. కేవలం కంగనాను తిట్టి బాలీవుడ్ లో నిత్యం తాప్సీ వార్తల్లో ఉండేలా జాగ్రత్త పడింది. దాంతో తెలియకుండానే అక్కడి హీరోయిన్ల లిస్ట్ లో తాప్సీను చేర్చారు అక్కడ మేకర్స్. దాంతో సోలో హీరోయిన్ గా తాప్సీకి సినిమాలు సైతం వచ్చాయి.
వాటిల్లో ఒకటి రెండు హిట్లు కూడా ఉండడంతో ఇక తాప్సీకి తిరుగులేకుండా పోయింది. మొదట టాలీవుడ్ లో సత్తా చూపిన ఈ ముద్దు గుమ్మ, మొత్తానికి పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకుంది. అయితే తాజాగా తాప్సీ పెళ్లి పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. చాలాకాలంగా తాప్సీ డేటింగ్ లో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
అసలు ఒకప్పుడు హీరోయిన్లు తమ భర్తలను పరిచయం చేయడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటిది ఇప్పటి హీరోయిన్లు మాత్రం తమ మాజీ ప్రియుడి దగ్గర నుంచి మొదలు పెడితే భవిష్యత్తులో ప్రియుడు అయ్యే అవకాశం ఉన్న వ్యక్తి వరకూ అంతా ఓపెన్ గా చెప్పేస్తున్నారు. పైగా మీడియా అడగకుండానే ప్రెస్ మీట్ పెట్టి మరీ డైరెక్ట్ గా తమ ప్రేమ రహస్యాలను పబ్లిక్ చేసేస్తున్నారు.
ఈ క్రమంలో తాప్సి(Heroine Taapsee) కూడా తాను గత కొంతకాలంగా లవ్ లో ఉన్నాను అని, తన ప్రియుడు మథియాస్ అనే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని, అతనితో తాను చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాను అని ఇలా తన ప్రేమలోని ప్రతి విషయం వివరంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రేమలోని మధురానుభూతులను బాగా అనుభవిస్తున్నాను అని కూడా సెలవిచ్చింది.
అయితే తాజాగా ఆమె పెళ్లి వార్త విషయానికి వస్తే.. తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. తాప్సీ పెళ్లి పై గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు పెళ్లి వార్తలు తప్పు. కానీ డేటింగ్ మాత్రం నిజం అంటూ సూటిగా సుత్తిలేకుండా చెప్పింది. కానీ, తాజాగా వస్తోన్న పెళ్లి వార్తల పై మాత్రం తాప్సీ ఏమి చెప్పట్లేదు. కాబట్టి.. ఆమె పెళ్లి వార్తల్లో నిజం ఉందని బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.