spot_img
Homeఎంటర్టైన్మెంట్Taapsee Pannu South Directors Controversy: సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ నన్ను చాలా అవమానించారు అంటూ...

Taapsee Pannu South Directors Controversy: సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ నన్ను చాలా అవమానించారు అంటూ నోరు జారిన హీరోయిన్ తాప్సీ!

Taapsee Pannu South Directors Controversy: మన సౌత్ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టడం, ఇక్కడ మంచి పేరొచ్చిన తర్వాత బాలీవుడ్ కి వెళ్లడం, అక్కడ మన ఇండస్ట్రీ పై ఇష్టమొచ్చినట్టు నోర్లు పారేసుకోవడం, ఈమధ్య కాలం లో హీరోయిన్స్ కి సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ తాప్సీ(Tapsee Pannu) గురించి మాట్లాడుకోవాలి. ఈమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చింది మన తెలుగు డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు. ‘జుమ్మంది నాథం’ చిత్రం ద్వారా ఈమెని ఆయన ఎంతో అందంగా చూపించడం వల్ల కుర్రాళ్లలో క్రేజ్ వచ్చింది. తద్వారా ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. అయితే సరైన స్క్రిప్ట్ సెలక్షన్ లేకపోవడం తో ఈమె సౌత్ నుండి పెద్దగా హిట్ సినిమాలు రాలేదు. మన టాలీవుడ్ లో అయితే ‘జుమ్మంది నాథం’ తర్వాత ఈమె చేసిన సినిమాల్లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఒక్కటే హిట్ అయ్యింది , అందులో కూడా ఈమె సెకండ్ హీరోయిన్.

అయితే టాలీవుడ్ లో ఈమెకు అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వచ్చాయి. అక్కడ ఈమె హీరోయిన్ గా నటించిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అయితే ఈమె చేసినవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. సౌత్ నుండి రానటువంటి సక్సెస్ ఈమెకు నార్త్ నుండి వచ్చింది. అయితే ఈమె అక్కడ సక్సెస్ అయిన తర్వాత అనేకసార్లు మన సౌత్ ఇండస్ట్రీ పై నోరు పారేసుకుంది. ఇప్పుడు మరోసారి అదే చేసింది. లేటెస్ట్ గా ఈమె ప్రధాన పాత్ర పోషించిన ‘అస్సి’ అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నెటిజెన్స్ అయితే ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇంతకీ ఆమె ఏమి మాట్లాడిందో చూద్దాం.

ఆమె మాట్లాడుతూ ‘సౌత్ ఇండస్ట్రీ లో నేను నటిస్తున్నప్పుడు, చాటి వద్ద ప్యాడ్స్ పెట్టుకొని రమ్మని నన్ను దర్శకులు ఒత్తిడి చేసేవారు.గ్లామర్ సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్స్ కోసం శరీర భాగాలు బాగా ఎక్స్ పోజ్ అవ్వాలని అలా చెప్పేవారు. ఎందుకంటే అక్కడి జనాలు అలా ఉంటేనే చూస్తారట. ఇష్టం లేకపోయినా దర్శకులు చెప్పారు కాబట్టి ప్యాడ్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. అలాంటి సందర్భం వచ్చినప్పుడు నేను చాలా అవమానకరంగా, అసౌకర్యంగా ఫీల్ అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది తాప్సి. అడల్ట్ రేటెడ్ సినిమాలు తీస్తున్న బాలీవుడ్ లోకి వెళ్లిన తాప్సి కి ఇలాంటి అనుభవాలు ఎదురు అయ్యుండవా?, కేవలం ఎందుకు ఆమె సౌత్ పైన ఇంత పగబట్టింది. అంటే ఇక్కడ ఆమెకు సక్సెస్ ఇవ్వలేదని కోపమా?, అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తాప్సి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్లే ఈరోజు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు, నేడు బాలీవుడ్ లో రెండు మూడు హిట్స్ పడేలోపు పొగరు చూపిస్తున్నావు, త్వరలోనే నేల మీదకు వస్తావు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper