https://oktelugu.com/

Taapsee Pannu: పెళ్లికి సిద్ధం అయిన హీరోయిన్‌ తాప్సీ

Taapsee Pannu: హీరోయిన్‌ తాప్సీ ప‌న్ను తొలినాళ్లలో టాలీవుడ్ సినిమాలు చేసినా తర్వాత ఎక్కువగా బాలీవుడ్ మూవీల్లో వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇక తాప్సీ విషయానికి ఆమెకు తెగింపు ఎక్కువ. అందుకే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : April 2, 2022 / 03:30 PM IST
    Follow us on

    Taapsee Pannu: హీరోయిన్‌ తాప్సీ ప‌న్ను తొలినాళ్లలో టాలీవుడ్ సినిమాలు చేసినా తర్వాత ఎక్కువగా బాలీవుడ్ మూవీల్లో వైవిధ్యభరితమైన రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేం స్వరూప్ ఆర్ఎస్జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.

    Taapsee Pannu

    ఇక తాప్సీ విషయానికి ఆమెకు తెగింపు ఎక్కువ. అందుకే అందరి పై విరుచుకుపడే కంగనా పైనే ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ త‌క్కువ కాలంలోనే హిందీలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. మొద‌ట టాలీవుడ్‌ లో స‌త్తా చూపిన ఈ ముద్దు గుమ్మ,‌ మొత్తానికి పాన్ ఇండియా బ్యూటీ అనిపించుకుంది. అయితే తాజాగా తాప్సీ పెళ్లి పై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది.

    Also Read:   టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

    చాలాకాలంగా తాప్సీ డేటింగ్ లో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. తాను గత కొంతకాలంగా లవ్ లో ఉన్నాను అని, తన ప్రియుడు మథియాస్ అనే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని, అతనితో తాను చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నాను అని ఇలా తన ప్రేమలోని ప్రతి విషయం వివరంగా చెప్పుకొచ్చింది తాప్సి. మొత్తానికి ప్రేమలోని మధురానుభూతులను బాగా అనుభవిస్తున్నాను అని కూడా సెలవిచ్చింది.

    Taapsee Pannu

    అయితే తాజాగా అతన్ని తాప్సీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందట. తాప్సీ పెళ్లి పై గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. అప్పుడు పెళ్లి వార్తలు తప్పు. కానీ డేటింగ్ మాత్రం నిజం అంటూ సూటిగా సుత్తిలేకుండా చెప్పింది. కానీ, తాజాగా పెళ్లికి తాప్సీ సిద్ధం అయినట్లు ఉంది.

    Also Read:  భీమ్లా నాయ‌క్ కు త‌ప్ప‌ని వివాదాల హోరు

    Tags