https://oktelugu.com/

Swag Collection: మొదటి రోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు..ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తున్న శ్రీ విష్ణు ‘స్వాగ్’ ఓపెనింగ్స్!

బుక్ మై షో టికెట్స్ పోర్టల్స్ యాప్ లో కేవలం ఇండియాలో మొదటి రోజు 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 34 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు బుక్ మై షో యాప్ లో లెక్కలు కనిపిస్తున్నాయి. దీంతో రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ అంచనా ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 04:58 PM IST

    Swag Collection(1)

    Follow us on

    Swag Collection: ప్రముఖ యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ చిత్రం ‘స్వాగ్’ ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తన ప్రతీ సినిమాతో ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని కలిగించే శ్రీ విష్ణు ‘సామజవరగమనా’, ‘ఓం భీం బుష్’ వంటి వరుస సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ‘స్వాగ్’ చిత్రం తో మరో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకొని హ్యాట్రిక్ హీరో గా నిలిచాడు. ఈ చిత్రానికి హర్షిత్ అనే నూతన దర్శకుడు మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమా హిస్టరీ లో ఇలాంటి సరికొత్త ఆలోచన పెద్ద పెద్ద పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ కూడా చేయలేదు. అలాంటి ఆలోచన రావడమే గొప్ప అనుకుంటే, ఆ ఆలోచనను సమర్ధవత్వం గా వెండితెర పై చూపించి ప్రేక్షకులను అలరించడం అనేది సాధారణమైన విషయం కాదు అనే చెప్పాలి. అందుకే ఒక పక్క ‘దేవర’ మేనియా నడుస్తున్నప్పటికీ ‘స్వాగ్’ చిత్రాన్ని వీక్షిస్తున్నారు ఆడియన్స్. మొదటి రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

    బుక్ మై షో టికెట్స్ పోర్టల్స్ యాప్ లో కేవలం ఇండియాలో మొదటి రోజు 30 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 34 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు బుక్ మై షో యాప్ లో లెక్కలు కనిపిస్తున్నాయి. దీంతో రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ షేర్ వసూళ్లు వచ్చినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. వాళ్ళ అంచనా ప్రకారం రెండవ రోజు ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. టాక్ బాగా రావడంతో ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం పికప్ అయ్యింది. నిన్నటితోనే ఈ సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ మార్కుని చేరుకుందని, నేటి నుండి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ కి లాభాల వర్షం కురుస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ వరల్డ్ వైడ్ 4 కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది.

    ప్రొమోషన్స్ మరియు పబ్లిసిటీ కాస్ట్స్ తో కలిపి మొత్తం 5 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. మూడు రోజుల వసూళ్లు దాదాపుగా 6 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో మరో 6 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి మూడింతల లాభాలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఏడాది విడుదలైన చిత్రాలలో అత్యధికంగా ఎక్కువ సక్సెస్ రేట్ ని అందుకున్న సినిమాలు చిన్న హీరోలవే అవ్వడం గమనార్హం. ఇలా వరుస సూపర్ హిట్స్ తో శ్రీ విష్ణు తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని, బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరిగా నిలిచాడు.