https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అక్షరాలా 20 లక్షల రూపాయిలు..వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ దాటికి విలవిలలాడిపోయిన పాత కంటెస్టెంట్స్!

పాత కంటెస్టెంట్స్ లో ఉన్న 8 మందికి నబీల్ చీఫ్ గా వ్యవహరిస్తాడు. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి, ఈ 8 మంది కలిసి ఒక క్లాన్ గా ఏర్పడ్డారు. పాత కంటెస్టెంట్స్ క్లాన్ పేరు 'ఓజీ', వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ క్లాన్ పేరు 'రాయల్'. మొదటి టాస్కు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ భీభత్సంగా ఆడి గెలుస్తారు. అందుకు గాను బిగ్ బాస్ వాళ్లకు పే మనీ గా 20 లక్షలు ప్రైజ్ మనీ కి జత చేస్తారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 6, 2024 / 04:36 PM IST

    Bigg Boss Telugu 8(88)

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ షో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అనే రేంజ్ లో ఉండబోతుంది. నేడు జరగబోయే ఎపిసోడ్ ద్వారా 8 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోపలకు అడుగుపెట్టబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ఎపిసోడ్ నిన్ననే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతూ ఉందట. హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ ఎవరంటే ముక్కు అవినాష్, గంగవ్వ, రోహిణి, హరి తేజ, గౌతమ్, టేస్టీ తేజా, మెహబూబ్ మరియు నయనీ పావని. వీళ్ళతో బిగ్ బాస్ అప్పుడే మూడు టాస్కులు కూడా ఆడించేశారట. గత వారం హౌస్ లో ఉన్న టాస్కులు గెలిచి నబీల్ మెగా చీఫ్ గా ఎంపికైన సంగతి అందరికీ తెలిసిందే.

    అంటే పాత కంటెస్టెంట్స్ లో ఉన్న 8 మందికి నబీల్ చీఫ్ గా వ్యవహరిస్తాడు. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా 8 మంది కంటెస్టెంట్స్ వచ్చారు కాబట్టి, ఈ 8 మంది కలిసి ఒక క్లాన్ గా ఏర్పడ్డారు. పాత కంటెస్టెంట్స్ క్లాన్ పేరు ‘ఓజీ’, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ క్లాన్ పేరు ‘రాయల్’. మొదటి టాస్కు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ భీభత్సంగా ఆడి గెలుస్తారు. అందుకు గాను బిగ్ బాస్ వాళ్లకు పే మనీ గా 20 లక్షలు ప్రైజ్ మనీ కి జత చేస్తారు. దీంతో ప్రైజ్ మనీ కాస్త 38 లక్షలకు చేరింది. మొత్తం మూడు టాస్కులు జరగగా, అందులో రెండు రాయల్ క్లాన్ గెలవగా, ఓజీ క్లాన్ కేవలం ఒక్క టాస్క్ మాత్రమే గెలుస్తుంది. హౌస్ లోకి ఇప్పుడు అడుగుపెట్టిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అందరూ మంచి ఫ్యాన్ బేస్ ఉన్నవారే. వీరిలో అందరికంటే గంగవ్వ హరితేజ, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాగే నయనీ పావని కూడా మంచి క్రేజ్ ఉంది. గత సీజన్ లో ఆమె బాగా ఆడినప్పటికీ కూడా మొదటి వారం లోనే ఎలిమినేట్ అయిపోయింది అనే సానుభూతి జనాల్లో ఉంది. అంతే కాకుండా ఆమె స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే నీతోనే డ్యాన్స్ షో లో అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మన్స్ చేసి రన్నర్ గా నిల్చింది.

    ఈ షో ద్వారా ఆమె కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. వీరిలో టేస్టీ తేజా కూడా తక్కువేం కాదు, ఆయన కూడా ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా మంచి ఫాలోయింగ్ ని సంపాదించాడు. కాబట్టి పాత కంటెస్టెంట్స్ కి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ చుక్కలు చూపించడం పక్కా. ఈరోజు నామినేషన్స్ ప్రక్రియ కూడా పాత కంటెస్టెంట్స్ ని నామినేట్ చేసే అవకాశం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్. వాళ్ళ నామినేషన్స్ అయిపోయిన తర్వాత పాత కంటెస్టెంట్స్ కి బాగా చర్చించుకొని ఇద్దరు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయండి అంటూ ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. మరి నామినేషన్స్ లో ఎవరెవరు వచ్చారు అనేది చూడాలి.