Devara: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆరేళ్ళ ఎన్టీఆర్ అభిమానుల ఆకలి ని తీర్చింది ఈ చిత్రం. ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ హిట్ వచ్చినప్పటికీ అభిమానుల్లో సంతృప్తి లేదు. ఎందుకంటే అది మల్టీస్టార్రర్ కాబట్టి. అందుకే ‘దేవర’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూసారు. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఓపెనింగ్స్ నుండి క్లోసింగ్ వరకు రోజుకో బెంచ్ మార్క్ ని బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. సాధారణంగా ఏ సినిమాకి అయినా వర్కింగ్ డేస్ లో వసూళ్లు బాగా తగ్గిపోతుంటాయి, కానీ దేవర చిత్రానికి మాత్రం డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అవుతూ వచ్చాయి. ఇక వీకెండ్స్ వచ్చిందంటే చాలు ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడేస్తున్నాడు.
శనివారం రోజు (9 వ రోజు) ఈ చిత్రానికి దాదాపుగా 3 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయట. దీంతో తెలుగు వెర్షన్ వసూళ్లు ఇప్పటి వరకు 156 కోట్ల రూపాయలకు చేరిందని అంటున్నారు. ఇక గ్రాస్ విషయానికి వస్తే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలకు కలిపి ఈ చిత్రానికి 335 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. దసరా పండుగ రోజు భారీ వసూళ్లను రాబడితే ఈ చిత్రం కచ్చితంగా 400 కోట్ల రూపాయిల మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం నేటితో నైజాం ప్రాంతం లో 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా నైజం ప్రాంతం లో 45 కోట్ల రూపాయలకు జరిగింది. ఈ దసరా తో ఆ మార్కుని అందుకుంటుందని అంటున్నారు. సీడెడ్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
నేటితో ఈ చిత్రం ఇక్కడ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ లో మాత్రం నిరాశ పర్చింది అనే చెప్పాలి. 9 రోజులకు కలిపి ఈ సినిమాకి కేవలం 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. షేర్ వసూళ్లు 33 కోట్ల రూపాయిలు ఉంటుందని అంచనా. ప్రభాస్ నటించిన కల్కి, సలార్ చిత్రాలు వంద కోట్ల రూపాయిల గ్రాస్ కు దగ్గరగా వసూళ్లను రాబట్టింది. అలాగే కర్ణాటక లో 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తమిళ నాడు లో 4 కోట్ల రూపాయిలు కేరళలో 88 లక్షలు, హిందీ లో 27 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.