Seethamma Vakitlo Sirimalle Chettu' re-release worldwide collections
SVSCReRelease Collection : టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ అని అనిపించుకున్న సినిమాలలో ఒకటి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'(#SVSCReRelease). కనుమరుగు అయిపోయిన మల్టీస్టారర్ ట్రెండ్ ఈ సినిమాతో మళ్ళీ మొదలైంది. 2013 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా 52 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి మహేష్ బాబు(Super Star Mahesh Babu), వెంకటేష్(Victory Venkatesh) కెరీర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ సినిమాని చూస్తున్నంత సేపు మన కుటుంబం లో జరిగే వ్యవహారాలే కనిపిస్తుంటాయి. టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ కూడా టెలికాస్ట్ అయ్యినప్పుడల్లా మంచి టీఆర్ఫీ ని సొంతం చేసుకుంటూ ఉంటుంది ఈ చిత్రం. అలాంటి క్లాసిక్ విలువలు ఉన్న ఈ సినిమా నిన్న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్లాస్ సినిమా కదా, రీ రిలీజ్ లో వర్కౌట్ అవ్వదేమో అని అందరూ అనుకున్నారు.
Also Read : మరో రీ రిలీజ్..మరో సెన్సేషనల్ రికార్డ్..’సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కి ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్!
కానీ నిన్న ఈ సినిమాకి ప్రతీ ప్రాంతంలో వచ్చిన వసూళ్లను చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. ప్రతీ చోట హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకున్న ఈ చిత్రానికి, కేవలం నైజాం ప్రాంతం నుండే 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో 40 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ ప్రాంతాలను కలిపి ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాల మొదటి రోజు రికార్డ్స్ తప్ప, మిగిలిన స్టార్ హీరోల రీ రిలీజ్ రికార్డ్స్ మొత్తం బద్దలయ్యాయి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. రెండవ రోజు కూడా ఈ సినిమాకి సిటీస్ లో మంచి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ఫుల్ రన్ లో 3 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో వీకెండ్ వరకు హౌస్ ఫుల్స్ నమోదు అయ్యాయి. అంతే కాకుండా సోమవారానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గట్టిగానే జరిగాయి. ఊపు చూస్తుంటే మొదటి వారం మొత్తం సుదర్శన్ థియేటర్ లో హౌస్ ఫుల్స్ నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని పాన్ ఇండియన్ కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేకపోవడం గమనార్హం. కేవలం సుదర్శన్ థియేటర్ నుండే ఫుల్ రన్ లో 50 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. కేవలం కొత్త సినిమాలకు మాత్రమే సాధ్యమయ్యే ఇలాంటి వసూళ్లు, మహేష్ ఒక రీ రిలీజ్ తో రాబట్టడం అనేది అరుదైన రికార్డుగా భావించవచ్చు.
Also Read : అభిప్రాయ బేధాలు వచ్చాయి..మహేష్, నేను విడిపోయాం అంటూ నమ్రత శిరోడ్కర్ షాకింగ్ కామెంట్స్!