Namrata Shirodkar : ఏ బంధం లో అయినా గొడవలు రావడం సహజం, అభిప్రాయ బేధాలు సర్వ సాధారణం. ముఖ్యంగా భార్య భర్తల బంధం, జీవితాంతం ఉండాల్సినది. తల్లిదండ్రులతో గొడవలు జరిగితే విడిపోతామా?, అలాంటప్పుడు చిన్న చిన్న గొడవలకు భార్య భర్తలు ఈమధ్య కాలం లో ఎందుకు విడిపోతున్నారు?, పెళ్ళైన అతి తక్కువ సమయంలోనే విడాకులు తీసుకుంటున్న జంటలను ఇటీవల కాలం లో చాలానే చూసాము. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అయితే విచ్చలవిడిగా తయారయ్యారు. కలిసి డేటింగ్ చేసినన్ని రోజులు కూడా పెళ్లి తర్వాత కలిసి ఉండడం లేదు. ఇలాంటోళ్లందరికీ ఆదర్శంగా నిలిచే జంటలలో ఒకటి మహేష్ బాబు(Super Star Mahesh Babu), నమ్రత శిరోడ్కర్(namrata shirodkar) జంట. వీళ్ళిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి అందరికీ తెలిసిందే. పెద్దగా హంగులు, ఆర్భాటాలు లేకుండా, చాలా సాధారణంగా, ఎవరికీ తెలియకుండా, ఇంటి పెద్దల సమక్షం లో వీళ్ళ పెళ్లి జరిగింది. నమ్రత అప్పటికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్.
Also Read : రాజమౌళితో మహేష్ లాక్.. పండుగలు, పబ్బాలకు నమ్రత.. పాపం ఎంత కష్టం వచ్చింది?
టాలీవుడ్ లో కూడా ఆమె పలు సినిమాలు చేసింది. కానీ మహేష్ తో పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరమైంది. పెళ్ళై ఇన్నేళ్లు అయినప్పటికీ కూడా ఎంతో అన్యోయంగా గడుపుతున్న వీళ్ళిద్దరిని చూసి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆదర్శంగా తీసుకోవచ్చు. రీసెంట్ గా నమ్రత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇప్పటి వరకు అభిమానులెవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ఆమె మాట్లాడుతూ ‘గౌతమ్ పుట్టిన కొత్తల్లో మహేష్ చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆర్థికంగా కూడా ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. అదే సమయంలో నేను తల్లిదండ్రులను కోల్పోయాను. మా ఇద్దరి మధ్య అదే సమయంలో విబేధాలు ఏర్పడ్డాయి. నాకు కోపం వచ్చి కొడుకు గౌతమ్ ని తీసుకొని ముంబై కి వచ్చేసాను. చాలా నెలలు మేము విడిపోయి అలాగే ఉన్నాము. ఆ సమయంలోనే మా బంధం ఎంత బలమైనదో, మా మధ్య ఎంత ప్రేమ ఉందో తెలుసుకున్నాము, మళ్ళీ వెంటనే కలిసిపోయాము’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోడ్కర్.
విడిపోయి మళ్ళీ కలుసుకున్న తర్వాతనే సితార జన్మించింది అట. ఇంకా ఆమె మాట్లాడుతూ ‘పెళ్లి తర్వాత నేను పని చేయకూడదు అని మహేష్ బాబు ముందుగానే చెప్పాడు. కేవలం సినీ రంగం లోనే కాదు, వేరే ఏ రంగం లో కూడా జాబ్ చేయడానికి ఆయన ఇష్టపడలేదు. అతని కోరిక మేరకే నేను సినిమాలు చేయడం ఆపేసాను. ఇండస్ట్రీ లో పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోవాలి, కోట్లు సంపాదించాలి అని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే సినిమాలు వదిలేసినప్పుడు పెద్దగా బాధ అనిపించలేదు’ అంటూ చెప్పుకొచ్చింది నమ్రత శిరోడ్కర్. ఇప్పుడు ఆమె మహేష్ కి సంబంధించిన అన్ని వ్యాపారాలను దగ్గరుండి చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక గృహిణి గా నమ్రత శిరోడ్కర్ కోట్లాది మంది ఆడపడుచులకు ఆదర్శప్రాయం అని అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : మహేష్ కాదు నమ్రత ఫస్ట్ లవర్ అతడే, 9 ఏళ్లు ప్రేమాయణం… పెళ్లి వరకు వెళ్లి బ్రేకప్!
