Bank Jobs : కేంద్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. పోస్టల్, రైల్వే, ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్‌తోపాటు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే నోటిఫకేషన్లు ఇచ్చాయి. తాజాగా ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ’’O’’) పోస్టుల రిక్రూట్‌మెంట్‌కు నోటిఫకేషన్‌చ్చింది. 650 ఖాళీలను ప్రకటించింది.
Also Read : 650 పోస్టులకు నోటిఫికేషన్.. మార్చి 1 నుంచి దరఖాస్తు ప్రక్రియ.. వివరాలు ఇవీ.
వివరాలు:
సంస్థ: ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI)
పోస్టు: జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ’’O’’)
ఖాళీల సంఖ్య: 650
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ (గ్రాడ్యుయేషన్)
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా
కోర్సు: ఎంపికైన అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (PGDBF) కోర్సును ఒక సంవత్సరం పాటు పూర్తి చేయాలి. ఈ కోర్సు సమయంలో స్టైపెండ్ అందుతుంది.
వేతనం: ఉద్యోగంలో చేరినప్పుడు సంవత్సరానికి రూ. 6.5 లక్షల వరకు వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: IDBI అధికారిక వెబ్‌సైట్ (www.idbibank.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ముఖ్య తేదీలు..
ఈ ఉద్యోగాలకు మార్చి 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏప్రిల్ 6న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
అభ్యర్థుల వయసు 22 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు జనరల్‌భ్యర్థులు రూ.1,050, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.
Also Read : పదో తరగతి అర్హతతో ఇండియన్ బ్యాంక్ లో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?