https://oktelugu.com/

OTT: సస్పెన్స్, థ్రిల్లింగ్ సినిమా కావాలా? ఓటీటీలో ఉంది.. చూడండి..

OTT: తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఇందులో కొందరు నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? దాని స్టోరీ ఎలా ఉంది?

Written By:
  • Srinivas
  • , Updated On : July 5, 2024 / 02:24 PM IST

    Suspenseful and thrilling movie

    Follow us on

    OTT: సినిమా థియేటర్లలో వచ్చే సినిమాల కంటే ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ కు ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. అందుకే చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు ఓటీటీ ఫ్లాట్ ఫాం ను దృష్టిలో ఉంచుకొని వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఈ మధ్య క్రెం, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఉండే వెబ్ స్టోరీస్ కు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. ఇందులో భాగంగా ఓ పజిల్ మూవీ ప్రతీ సీన్ ట్విస్ట్ లతో మూవ్ అవుతోంది. మరోవైపు ఎమోషన్స్, థ్రిల్లింగ్ సీన్స్ షాక్ తెప్పిస్తాయి. తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఇందులో కొందరు నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటి? దాని స్టోరీ ఎలా ఉంది? ఆ వివరాల్లోకి వెళితే..

    అడుగడుగునా సస్పెన్స్ తో నడిచే ఈ మూవీ పేరు ‘నవంబర్ స్టోరీ’. ఓ వ్యక్తి ఇంట్లో అనుకోకుండా మృతదేహం లభించడం.. ఆ తరువాత అతను అరెస్ట్ అవడం. తన తండ్రిని కాపాడుకోవడానికి కూతురు పడే కష్టాలు అంతా రియల్ లైఫ్ ను తలపిస్తాయి. అల్జూమర్స్ వ్యాధి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో మృతదేహం లభించడంతో అతడిని అరెస్ట్ చేస్తారు. ఈ పాత్రలో జీఎం కుమార్ నటించారు. అనుకోకుండా కేసులో ఇరుకున్న తన తండ్రిని కాపాడేందుకు కూతురు పాత్రలో తమన్నా కనిపించింది. ఇక అనురాద గణేషన్ ఎథికల్ హ్యాకర్ గా ఆకట్టుకుంటాడు.

    ‘నవంబర్ స్టోరీ’ షూటింగ్ ను 2019లో మొదలు పెట్టారు. అయితే ఆ సమయంలో కరోనా తో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి 2021 మే నుంచి ఇది డిస్నీ ప్లస్ స్టార్ లో రన్ అవుతోంది. అయితే ఇటీవల ఇలాంటి కథాంశాలను ప్రేక్షకులు ఎక్కువగా లైక్ చేస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఉండే సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మూవీ కోసం తెగ వెతుకుతున్నారు. ఒక రకంగా ఈ సినిమా చూస్తున్నంత సేపే ఏదో లోకంలో ఉన్నామని అనిపిస్తూ ఉంటుంది.