Kalki Movie: ప్రభాస్ నటించిన ‘కల్కి AD 2898’ ప్రభంజనం సృష్టిస్తోంది. చాలా నెలల తరువాత ఒక తెలుగు సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. సినిమాలో ఉన్న విజువల్స్, సన్నివేశాలు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పడుతున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు బిగ్ స్టార్లు సైతం కల్కిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘కల్కి’ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఆకట్టుకోవడంతో బాలీవుడ్ కు చెందిన ఓ నటుడు తన ఆక్రోశాన్ని వెళ్లగక్కాడు. సినిమా ఏమాత్రం బాగా లేదని, విలువలు లేకుండా తీశారని విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన విమర్శలపై కొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?
ఒక తెలుగు సినిమా పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతుంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఎప్పుడూ ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉంటారు. లేటేస్టుగా ముఖేష్ ఖన్నా తన ఇన్ స్ట్రాగ్రామ్ సోషల్ మీడియా లో కల్కి గురించి రాశాడు. ‘కల్కి’ సినిమాలో మహా భారతం కు సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో కొన్ని సీన్స్ మహాభారతానికి వ్యతిరేకంగా తీశారని, వీటిలో ఏమాత్రం విలువలు పాటించలేదని ఆయన చెప్పారు.
ముఖేష్ ఖన్నాకు చెందిన సోషల్ మీడియా ఖాతాలో ఇలా ఉంది.. ‘కల్కి’ సినిమాకు ‘కల్’ అని పేరు పెట్టాల్సి ఉంది. ఈ సినిమాను మన సౌలభ్యం కోసం తీశారు. ఇందులో మహాభారతంలోని వాస్తవాలను వక్రీకరించారు. అర్జునుడు, భీముడు కలిసి అశ్వత్థామ నుదుటి మీద ఉన్న రత్నంను తీసి ద్రౌపదికి ఇచ్చారు. అయితే ద్రౌపది ఐదుగురు కుమారులను వారి శిబిరంలోకి వెళ్లి అశ్వత్తామ చంపేశాడు. కానీ అశ్వత్థామ వద్దకు ద్రౌపది ఎందుకు వచ్చింది? ఇలాంటి తప్పులు ఇంకా చాలా ఉన్నాయి.
సినిమా తీసేముందు నిర్మాతలు ఈ విషయాన్ని ఎందుకు గ్రహించరు? అలాగే ముఖేష్ ఖన్నా తన యూట్యూబ్ చానెల్ లోనూ కొన్ని విషయాలను చెప్పారు. అర్జునుడు, అశ్వత్థామ మధ్య యుద్ధం జరుగుతుంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఎలా తిప్పికొట్టాలో అర్జునుడికి మాత్రమే తెలుసు. అందుకే అతడు అభిమన్యుడి భార్యపై సంధించాడు. ఇలా కొన్ని మార్పులు చేసి తీసిన ఈ సినిమాపై ప్రతి ఒక్కరూ అడగాలని ముఖేష్ కన్నా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.