Sushmita: మాజీ విశ్వసుందరి, ప్రముఖ హీరోయిన్ సుస్మితా సేన్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకుంటుంటుంది. ఎన్నో సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
2018లో సుస్మిత, రోహ్మన్తో సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచే అతనితో డేటింగ్లో ఉన్నట్లు సుస్మిత అధికారికంగా వెల్లడించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ బహిరంగ ప్రదేశాలతో పాటు, ఫ్యామిలీ ఫంక్షన్స్‌లోనూ తరచూ జంటగా కనిపిస్తుండేవారు.
అయితే, గతకొంత కాలంగా వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై పలు ఊహాగానాలు వినిపిస్తున్నారు. వీద్దరూ విడిపోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు సుస్మిత ఆ విషయాన్ని నిజం చేస్తూ.. ఇన్స్టాగ్రామ్ వేదికగా రోహ్మన్తో తన బ్రేకప్ను ప్రకటించింది. స్నేహితులుగా మొదలైన మా ప్రయాణం.. ఇప్పుడు కూడా అలాగే ఉండాలనుకుంటున్నాం. మా మధ్య బంధం ముగిసినప్పటికీ.. ప్రేమ మాత్రం అలాగే శాస్వితంగా ఉంటుంది. అని పేర్కొన్నారు. భారత్‌లో ఫేమస్ మోడల్‌గా పేరు పొందిన రోహ్మన్.. సుస్మిత కన్న వయసులో 15 ఏళ్లు చిన్నవాడు. కాగా, రోహ్మన్ను ఎంతగానో ప్రేమించే సుస్మిత సడన్‌గా ఈ నిర్ణయం తీసుకోవడంతో అభిమానులు షాక్ అయ్యారు.