https://oktelugu.com/

Sushmita Sen: వారిద్దరూ మళ్ళీ కలిసిపోయారు.. వైరల్ అవుతున్న వీడియో

Sushmita Sen: బోల్డ్ సమాజంలో ఎదురులేని మాజీ హీరోయిన్ ‘సుస్మితా సేన్’. వయసు అయిపోతున్నా ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోయినా ఆమె రోహ్మన్‌ షాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కానీ, కొన్నాళ్ళు పాటు ఘాటు ప్రేమలో నిండా మునిగిపోయిన ఈ జంట.. చివరకు విసిగిపోయి.. ఆ మధ్య తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ, ఈ బాలీవుడ్‌ మాజీ లవ్‌ బర్డ్స్‌ ఇద్దరూ బ్రేకప్‌ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు. బ్రేకప్‌ తర్వాత తొలిసారిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 22, 2022 / 03:41 PM IST
    Follow us on

    Sushmita Sen: బోల్డ్ సమాజంలో ఎదురులేని మాజీ హీరోయిన్ ‘సుస్మితా సేన్’. వయసు అయిపోతున్నా ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోయినా ఆమె రోహ్మన్‌ షాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. కానీ, కొన్నాళ్ళు పాటు ఘాటు ప్రేమలో నిండా మునిగిపోయిన ఈ జంట.. చివరకు విసిగిపోయి.. ఆ మధ్య తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకున్నారు. కానీ, ఈ బాలీవుడ్‌ మాజీ లవ్‌ బర్డ్స్‌ ఇద్దరూ బ్రేకప్‌ తర్వాత తొలిసారిగా కలుసుకున్నారు.

    Sushmita Sen

    Sushmita Sen

    బ్రేకప్‌ తర్వాత తొలిసారిగా కలుసుకోవడం కోసం ముంబైలోని ఓ రెస్టారెంట్‌ కి వెళ్లారు. అయితే, అక్కడ అనుకోకుండా ఈ జంట మీడియా కంట పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. వీడియోలో తన ప్రేయసిని చాలా జాగ్రత్తగా కారు ఎక్కించాడు రోహ్మన్‌. అది చూసిన ఫ్యాన్స్ వీళ్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలంటూ సంతోషంగా కామెంట్స్ చేస్తున్నారు.

    Also Read: Star Hero: ఛాన్స్ లు రాక కూలీ పనులు చేసిన స్టార్ హీరో

    ఇక సుష్మితా సేన్ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. ఏది ఏమైనా హిందీ ప్రేక్షకుల నేటి మహానటి ఆమె, నిన్నటి తరం ప్రేక్షకులకు సౌందర్య రాశి ఆమె, హిందీలో సహజనటి అంటే ఆమె, తన సహజమైన హావభావాలతో అంతకుమించిన హోమ్లీ గ్లామర్ డాల్ గా హిందీ సినీ హృదయాలను ఆకట్టుకున్న గొప్ప అందాల చాతుర్యం అమెది.

    సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నా.. ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రల వైపే ఆమె ప్రయత్నాలు సాగాయి. అందుకే ఆమె నటన ఓ సమ్మోహనం, ఆమె అందం సహజ సిద్ధం, హిందీలో మోస్ట్ మాజీ గ్లామరస్ బ్యూటీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘సుష్మితా సేన్’. ఎన్నో సినిమాల్లో, మరెన్నో పాత్రల్లో హిందీ మహానటి స్థాయిలో మాస్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ ‘సుష్మితా సేన్’.

    Sushmita Sen

    సుష్మితా సేన్ కాలేజీ రోజుల్లో చదువుకునేటప్పటి నుంచే హీరోయిన్ కావాలని చాలా కష్టపడింది. అయితే, ఆమెకు మొదట అవకాశాలు ఇవ్వలేదు. నటన రాదు, ఈమె హీరోయిన్ ఏమిటి ? అన్నవాళ్ళే.. రెండేళ్ళు తిరిగేసరికి హీరోయిన్ అంటే.. ఈమె.. అనే స్థాయికి చేరింది సుష్మితా సేన్. విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. కెరీర్ లో అంచెలంచెలుగా ఎదిగింది. నేటికీ హిందీ వెండితెర పై తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

    Recommended Video:

    Tags