ఇలా రకరకాలుగా పుకార్లు వైరల్ అవుతూనే ఉన్నాయి గానీ, నిజాలు ఏమిటో ఏడాది తర్వాత కూడా పూర్తిగా తేలకపోవడం మన దేశ న్యాయ వ్యవస్థకే అవమానం. అయితే, సీబీఐ విచారణ ఇంకా కొనసాగిస్తోంది. కానీ ఆ విచారణ ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా లేదు. మరోపక్క సుశాంత్ సింగ్ మరణాన్ని వాడుకోవడానికి రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయి. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ పెద్దలు, కేంద్ర ప్రభుత్వం చాలా హడావిడి చేశాయనే విమర్శలు ఉన్నాయి.
దీనికి తోడు, ఈ కేసులో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యుల పాత్ర కూడా అనుమానాస్పదంగానే ఉందని రూమర్స్ వచ్చాయి. ఇక ఈ రోజుతోటి ఈ సంఘటన జరిగి ఏడాది అవుతుంది. ఏడాది తర్వాత కూడా సుశాంత్ సింగ్ మరణం మిగిల్చిన ప్రశ్నలు ఇంకా అలాగే ఉండటం నిజంగా దురదృష్టకరమే. రీసెంట్ గా ‘సుశాంత్ సింగ్ రాజ్ పుత్’ మేనేజర్ సిద్ధార్థ్ ను ఎన్‌సీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అయితే, సిద్ధార్థ్ ను దేనికి అరెస్ట్ చేశారు ? అసలు ఇంతకీ ‘సుషాంత్ సింగ్ రాజ్ పుత్’ది హ్యత్యా ? ఆత్మహత్యా ? అనే విషయాల పై క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. సినీ ప్రేమికులతో పాటు సాధారణ ప్రేక్షకుల మనసులను కూడా తీవ్రంగా కలిచివేసిన ఈ విషాద సంఘటన వెనుక పుట్టుకొచ్చిన ప్రశ్నలకు.. మరి ఎప్పటికైనా సమాధానాలు దక్కుతాయా ? అనుమానమే.