నొచ్చుకున్న నాగబాబు.. ఇంటికే పరిమితం

రాజకీయాలంటే చిరంజీవి సోదరుడు నాగబాబు పెద్దగా ఆసక్తి ఉండదు. ఏదో అప్రయత్నంగానే ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎవరైనా కించిత్ మాటన్నా తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో కంటే జనసేన హయాంలోనే బాగా బాధ పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు, ట్విట్టర్ విమర్శలకు పూర్తిగా దూరమైపోయారు. ఈ దఫా చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రజారాజ్యం సమయంలో మెగా అభిమానులందరికీ ఏకం చేసే బాధ్యత తీసుకుని ముందుకు నడిచారు. […]

Written By: Srinivas, Updated On : June 14, 2021 4:32 pm
Follow us on

రాజకీయాలంటే చిరంజీవి సోదరుడు నాగబాబు పెద్దగా ఆసక్తి ఉండదు. ఏదో అప్రయత్నంగానే ఆయన రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారు. ఎవరైనా కించిత్ మాటన్నా తట్టుకోలేక ఇంటికి వెళ్లిపోతారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో కంటే జనసేన హయాంలోనే బాగా బాధ పడినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు, ట్విట్టర్ విమర్శలకు పూర్తిగా దూరమైపోయారు. ఈ దఫా చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం సాగుతోంది.

ప్రజారాజ్యం సమయంలో మెగా అభిమానులందరికీ ఏకం చేసే బాధ్యత తీసుకుని ముందుకు నడిచారు. పార్టీ కీలకంగా వ్యవహరించారు. కానీ నాగబాబు సైడ్ కావడంతో అల్లు అరవింద్ హవా పెరిగింది. చివరకు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో కూడా అరవింద్ మాటే నెగ్గింది. తర్వాత జనసేనలోకి కూడా నాగబాబు ఆలస్యంగా వచ్చారు. పవన్ ను ఎవరేమన్నా అంతెత్తున ఎగిరిపడేవారు. ట్వీట్లతో చెలరేగిపోయారు.

పార్టీ ఓడినా, గెలిచినా బాధ పడిన నాగబాబు తమ్ముడు చేసిన ఓ ట్వీట్ పై తమ్ముడు రియాక్ట్ అయ్యేసరికి నొచ్చుకున్నాడు. అప్పటి నుంచి సైలెంట్ అయ్యారు. జనసేనలో తనకంటే నాదెండ్ల మనోహర్ కే ఎక్కువ విలువ ఉందనే విషయం గురించి పార్టీకి దూరం జరిగాడు. పార్టీ మూసేసిన చిరంజీవి హ్యాపీ గా సినిమాలు చేసుకుంటున్నారు. కానీ నాగబాబు మాత్రం అటు సినిమాలు చేయలేక ఇటు రాజకీయాల్లో ఇమడలేక స్తబ్దుగా ఉండిపోయారు.

అన్నదమ్ముల కోసం అంతా కష్టపడి నాగబాబు ఇప్పుడు ఒంటరై పోయారు. అన్నయ్యకు బ్యానర్ ఉంది, తమ్ముడు పూర్తి కమర్షియల్ అయిపోయారు. దీంతో నాగబాబు సొంత యూట్యూబ్ ఛానల్ లో కాలక్షేపం చేస్తున్నారు. జబర్దస్త్ కి కూడా దూరం కావడంతో నాగబాబు మీడియా దూరమయ్యారు. జనసేన లో నాగబాబు ఏ మేరకు ప్రాధాన్యత దక్కుతుందో వేచి చూడాల్సిందే.