జగన్ బెయిల్ పై ఉత్కంఠ.. కోర్టులో ఏం కానుంది?

అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడంతో వైఎస్ జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేశారు. వీటిపై రఘురామ కౌంటర్ మరో దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ […]

Written By: Srinivas, Updated On : June 14, 2021 3:33 pm
Follow us on

అక్రమాస్తుల కేసులో గతంలో వైఎస్ జగన్ కు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ పై సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేయడంతో వైఎస్ జగన్ తో పాటు సీబీఐ కూడా కౌంటర్ దాఖలు చేశారు. వీటిపై రఘురామ కౌంటర్ మరో దాఖలు చేశారు.

అక్రమాస్తుల కేసులో గతంలో సీబీఐ కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు పై రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో జగన్, సీబీఐ ఆలస్యం చేయడంతో సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో వీరిద్దరూ జూన్ 1న కౌంటర్లు దాఖలు చేశారు.

ఇందులో జగన్, రఘురామ కృష్ణంరాజు ఉద్దేశపూర్వకంగానే తనపై ఉన్న కేసులను దాచిపెట్టి తన బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేశారని ఆరోపించారు. రాజకీయ స్వప్రయోజనాలకు దాఖలు చేసిన ఈ పిటిషన్ కొట్టేయాలని కోర్టును కోరారు. అటు సీబీఐ దాఖలు చేసిన మెమో కూడా ఆసక్తికరంగా ఉంది. జగన్ బెయిల్ రద్దు విషయంలో నేరుగా చెప్పకుండా చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పడంతో ఈ కేసులో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. సీబీఐ తీరుపై విపక్షాలు కూడా విమర్శలకు దిగాయి.

బెయిల్ రద్దు చేయాలో వద్దో చెప్పకుండా సీబీఐ కప్పదాటు వైఖరి ప్రదర్శించడం పై విమర్శలు వచ్చాయి. అయినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరిన నేపథ్యంలో సీబీఐ వాదనకు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మరోవైపు జగన్, సీబీఐ దాఖలు చేసిన కౌంటర్లపై రఘురామ మరో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు జగన్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీంతో సీబీఐ కోర్టు విచారణ వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేసింది.