ఆసుపత్రులు అందుకే నిండాయి:ఈటెల

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడినవారికి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికిత్సకు ధరలను నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఆరోగ్య […]

Written By: Neelambaram, Updated On : June 15, 2020 7:28 pm
Follow us on

కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు, పరిస్థితులను తెలుసుకునేందుకు తాను ఉన్నతస్థాయి సమీక్షలు ప్రతి రోజు నిర్వహిస్తున్నానని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడినవారికి ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనాకు చికిత్సకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో చికిత్సకు ధరలను నిర్ణయించారు.

ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ వివరించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200 అని, వెంటిలేటర్‌ అవసరం లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ.7,500 తీసుకోవాలని, ఒకవేళ రోగి వెంటిలేటర్‌ పై ఉంటే రోజుకు రూ.9,000 వసూలు చేయాలని కోరారు.

అయితే, కరోనా లక్షణాలు లేని వారికి పరీక్షలు చేయరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్నవారికే పరీక్షలు చేయాలని తాము మార్గదర్శకాలు ఇస్తున్నామని ప్రకటించారు. తెలంగాణలో వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్‌ తేల్చి చెప్పిందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో ప్రతి రోజూ వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో మరో 237 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఏకంగా 195 మందికి ఈ వైరస్ సోకింది.