Surya – Dulquer Salmaan: స్టాండర్డ్స్ పరంగాను టెక్నికల్ పరంగాను మన సౌత్ ఇండియన్ సినిమా బాలీవుడ్ పై అగ్ర స్థానం ఎప్పుడో సాధించేసింది..ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో టాప్ 3 చిత్రాలు మన సౌత్ ఇండియన్ సినిమాలే అనే విషయం మన అందరికి తెలిసిందే..ప్రత్యేకంగా చెప్పనవర్షం లేదు..దీనితో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ మరియు మల్టీస్టార్ర్ర్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు..ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే తమిళ స్టార్ హీరో సూర్య మరియు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కాంబినేషన్ లో ఒక సినిమాని తెరకెక్కించడానికి KGF చిత్రాన్ని నిర్మించి ‘హోమబుల్’ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తుంది..ఇటీవలే ప్రముఖ మహిళా దర్శకురాలు సుధా కొంగర తో హోమబుల్ సంస్థ ఒక సినిమా చెయ్యబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికి తెలిసిందే..గతం లో ఈమె సూర్య తో ‘ఆకాశమే నీ హద్దురా’ అనే సినిమాని తీసింది..డైరెక్టుగా OTT లో విడుదలైన ఈ సినిమాకి అప్పట్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఇప్పుడు ఇదే సినిమాని హిందీ లో అక్షయ్ కుమార్ హీరో గా సూర్య నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది..దీనికి కూడా సుధా కొంగర నే దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పుడు హోమబుల్ సంస్థ లో సినిమా అవకాశం కూడా సూర్య వల్లే ఆమెకి దక్కింది అంటూ సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త..అద్భుతమైన స్క్రిప్ట్ తో సూర్య మరియు దుల్కర్ సల్మాన్ వద్దకి వెళ్లారని..వాళ్లకి కదా బాగా నచ్చడం తో హోమబుల్ బ్యానర్ లో ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..సౌత్ లో సూర్య కి ఎలాంటి క్రేజ్ ఉందొ మన అందరికి తెలిసిందే..తమిళం తో పాటుగా తెలుగు మరియు మలయాళం బాషలలో సూర్య కి ఉండే మార్కెట్ కేవలం రజినీకాంత్ కి మాత్రమే ఉంది అని చెప్పొచ్చు..ఇక దుల్కర్ కూడా నేటి తరం యువ హీరోలలో సౌత్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్న హీరో గా నిలిచాడు..ఈయన నటించిన ‘కనులు కనులు దోచాయంటే’ , ‘కురుప్’ మరియు ‘మహానటి’ వంటి సినిమాలు తెలుగు లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.
Also Read: NTR- Koratala Siva: సెకండ్ హాఫ్ పై ఎన్టీఆర్ అసంతృప్తి..అయోమయం లో పడిన కొరటాల శివ
తమిళం లో కూడా ఈయనకి మంచి హిట్స్ ఉన్నాయి..ఇలా సౌత్ ఇండియా కి సంబంధించిన ఇద్దరు క్రేజీ హీరోలు ఒకే సినిమాలో నటిస్తుండడం వల్ల హిట్ అయితే మాత్రం కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త వండర్స్ జరుగుతాయి అని ట్రేడ్ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి..ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:Prashanth Neel – NTR: పాకిస్థానీగా నటిస్తున్న ఎన్టీఆర్.. ఇది ఇండియాకే గర్వకారణం