Surya Daughter: సూర్య(Suriya Sivakumar), జ్యోతిక(Jyothika) లకు దేవ్, దియా అనే ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వీళ్లకు సంబంధించిన ఫోటోలను జ్యోతిక అప్పుడప్పుడు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది. స్కూల్ నుండి ఇంటర్ వరకు తమ పిల్లలు ఏ ఘనత సాధించినా అది అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది జ్యోతిక. ఈ క్రమంలో గతంలో ఆమె తనకు కూతురుకి సంబంధించిన ఇంటర్మీడియట్ మార్కుల మెమోని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా అది బాగా వైరల్ అయ్యింది. ఈ మార్క్స్ మెమో లో డియో కి ఒక్కో సబ్జెక్టు లో వచ్చిన మార్కులు చూస్తే మతిపోవాల్సిందే. తమిళంలో 96 మార్కులు, ఇంగ్లీష్ లో 97 మార్కులు, ఫిజిక్స్ లో 99 మార్కులు, కంప్యూటర్ సైన్స్ లో 97 మార్కులు, మొత్తం మీద 600 మార్కులకు గానూ 581 మార్కులు వచ్చినట్టు ఆ ఫొటోలో కనిపిస్తుంది. అయితే ఇది చాలా పాత ఫోటో అని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: నిన్న మరిది.. నేడు పీఏ..నెక్ట్స్ విడదల రజనీనేనా?
2006 వ సంవత్సరం లో సూర్య, జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్ళికి సూర్య తండ్రి శివకుమార్ మొదట్లో ఒప్పుకోలేదు. అయిష్టంగానే పెళ్లి చేసాడు, చాలా కాలం వరకు జ్యోతిక తో మాట్లాడలేదు కూడా. కానీ ఆ తర్వాత నెమ్మదిగా ఆమె మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో కలిసిపోయి ఉంటున్నాడు. ఈ కాలం లో ఉమ్మడి కుటుంబం గా అందరూ ఒకే ఇంట్లో ఉండడం ఎప్పుడైనా చూసారా?, కానీ సూర్య ఇల్లు ఒక ఉమ్మడి కుటుంబం గానే ఏళ్ళ తరబడి నుండి ఉంటున్నారు. సూర్య కుటుంబం, కార్తీ కుటుంబం,పిల్లలు, తల్లిదండ్రులు అంతా కలిసి ఒకే ఇంట్లో ఎలాంటి మనస్పర్థలు లేకుండా సుఖంగా జీవిస్తూ ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే సూర్య లో మంచి సేవా గుణం కూడా ఉంది.
అగారం అనే ఫౌండేషన్ ని స్థాపించి ఎంతో మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పేస్తున్నాడు. రీసెంట్ గానే ఆయన తన ‘రెట్రో’ చిత్రం నుండి వచ్చిన వసూళ్లలో పది కోట్ల రూపాయలకు అగారం ఫౌండేషన్ కి విరాళం గా అందించాడు. తమిళనాడు లో ఇంత ఓపెన్ గా సోషల్ సర్వీస్ చేస్తున్న ఏకైక హీరో విజయ్ మాత్రమే. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన రెట్రో చిత్రం విషయానికి వస్తే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఈ చిత్రం. ఈ వీకెండ్ తో వంద కోట్ల గ్రాస్ మార్కుని కూడా దాటబోతుంది.