Jyothika Surprise to Surya: స్టార్ సూర్య(Suriya) జన్మదినం వేడుకలు ఓ రేంజ్ లో సెలబ్రేట్ సతీమణి జ్యోతిక(Jyothika). స్టార్ కపుల్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
దేశం మెచ్చిన నటుల్లో సూర్య ఒకరు. స్టార్డం చట్రంలో ఇరుక్కోకుండా ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఈ కోలీవుడ్ స్టార్ కి ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు భారీ మార్కెట్ ఉంది. నటుడు శివకుమార్ కొడుకైన సూర్య… 1997లో నెరుక్కు నేర్ మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. ఇది మల్టీస్టారర్ కాగా విజయ్ మరో హీరోగా నటించారు. నంద సూర్యకు బ్రేక్ ఇచ్చింది. కాకా కాకా, పితామగన్ చిత్రాలు సూర్యకు ఫేమ్ తెచ్చాయి.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ మూవీ లో నటించనున్న ఎన్టీఆర్ హీరోయిన్…
దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన గజినీ సూర్య కెరీర్లో భారీ హిట్ గా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో గజినీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగులో సూర్యకు గజినీతో మార్కెట్ ఏర్పడిందని చెప్పొచ్చు. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో అనేక విలక్షణ పాత్రలు చేశాడు సూర్య. సురారైపోట్రు చిత్రంలోని నటనకు గాను సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. సూర్య సోషల్ వర్కర్ కూడాను. అగరం ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. సూర్య నిర్మాతగా సైతం రాణిస్తున్నారు. సందేశంతో కూడిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఆయన తన బ్యానర్ లో నిర్మిస్తున్నారు.
హీరోయిన్ జ్యోతికను సూర్య 2006లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బెస్ట్ సెలబ్రిటీ కపుల్ అయిన సూర్య-జ్యోతికల ఆలోచనలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇద్దరికీ సామాజిక స్పృహ ఎక్కువే. 1975 జులై 23న జన్మించిన సూర్య 50వ జన్మదినం జరుపుకున్నారు. సూర్య జన్మదిన వేడుకలు జ్యోతిక ఘనంగా నిర్వహించింది. 50 నెంబర్ తో కూడిన హ్యాట్ తో పాటు హ్యాపీ బర్త్ డే ట్యాగ్ ని సూర్యకు ధరింపజేసింది. సూర్యతో పాటు జ్యోతిక ఓ రొమాంటిక్ ఫోజిచ్చారు. ఈ ఫోటో వైరల్ అవుతుంది.
Also Read: ఒక్క సీన్ చెప్పి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేశాడుగా..?
హీరో మాధవన్ సూర్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశాడు. మరో 50 ఏళ్ళ పాటు అద్భుతమైన జీవితాన్ని మీరు గడపాలి. హ్యాపీ బర్త్ డే బ్రదర్.. అంటూ సూర్య, జ్యోతికల ఫోటో షేర్ చేశాడు మాధవన్. సూర్య ఫ్యామిలీ ముంబైకి షిఫ్ట్ అయిన నేపథ్యంలో అక్కడే సూర్య బర్త్ డే వేడుకలు జరిగాయని సమాచారం. సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు, అభిమానుల నుండి సూర్యకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సూర్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన లేటెస్ట్ మూవీ కరుప్పు టీజర్ విడుదల చేశారు.