Allu Arjun Atlee movie: పుష్ప 2 (Pushpa 2 ) సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్(Allu Arjun)… అలా వైకుంఠపురంలో (Ala Vaikuntapuram lo) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుని కొల్లగొట్టిన ఆయన పుష్ప (Pushpa) సినిమాతో పాన్ ఇండియాలోకి ప్రవేశించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక మొదటి పార్ట్ తోఎలాగైతే సూపర్ సక్సెస్ ని సాధించాడో రెండో పార్ట్ ని అంతకుమించిన కసితో చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు. పాన్ ఇండియాలో ఈ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేసిందనే విషయం మనకు తెలిసిందే… అల్లు అర్జున్ – అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ ని కూడా మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. మరి మొత్తానికైతే ఈ సినిమాలో అల్లు అర్జున్ 4 క్యారెక్టర్స్ లలో కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకొనే ను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. అయితే మరొక హీరోయిన్ కి కూడా ఇందులో అవకాశం ఉందట. ఇక దానికోసం దేవర సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వి కపూర్ (Janvi Kapoor) ని ఇందులో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక శ్రీదేవి కూతురుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ దేవర సినిమాలో నటించింది.
Also Read: ‘ఏంటి బ్రో..బుద్దుందా నీకు’ అంటూ అభిమానిపై చిరాకు పడ్డ రాజమౌళి..వీడియో వైరల్!