Kanguva Trailer Talk: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గత 20 సంవత్సరాల నుంచి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ వస్తున్న నటుడు సూర్య… ‘గజిని’ సినిమాతో తమిళ్, తెలుగు రెండు భాషల్లో సూపర్ సక్సెస్ ని అందుకున్న ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక మధ్యలో సక్సెస్ ల పరంగా కొద్దిగా తడబడినప్పటికీ నటన విషయంలో మాత్రం ఆయన ఎప్పుడూ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని ఇస్తూనే వచ్చాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం సూర్య శివ డైరెక్షన్ లో కంగువ సినిమా చేస్తున్నాడు. సూర్య ఈ సినిమా మీద భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన తమిళ్ ట్రైలర్ ని ఈ రోజే రిలీజ్ చేశారు… ఇక ఈ ట్రైలర్ ను చూస్తుంటే విజువల్ వండర్ గా తెరకెక్కడమే కాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ తో కూడిన ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది.
ఇక ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ పాత్రను పోషించగా అతనికి సూర్యకి మధ్య ఒక రివెంజ్ డ్రామా అనేది క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళిద్దరు ఇచ్చే పర్ఫామెన్స్ తో ఎవరు ఎవరిని డామినేట్ చేయబోతున్నారు అనేది సినిమా చూస్తే గాని తెలియదు. ఇక మొత్తానికైతే విజువల్స్ అయితే టాప్ రేంజ్ లో ఉన్నాయి. మొత్తం అడవిలోనే సాగే ఈ సినిమా ఒక తెగకి సంబంధించిన రియల్ స్టోరీ గా తెలుస్తుంది. మరి దీనిని శివ భారీ ఎఫర్ట్ ను పెట్టి తీసినట్టుగా తెలుస్తుంది…
మొత్తానికైతే ఈ సినిమాతో సూర్య ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఇక హాలీవుడ్ ను తలపించేలా విజువల్స్ తో వస్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటివరకు రొటీన్ కమర్షియల్ సినిమాలను చేస్తూ వచ్చిన శివ ఒక్కసారిగా తన రూటు మార్చి భారీ గ్రాఫికల్ విజువల్ వండర్ గా తెరకెక్కించడం అనేది నిజంగా ఒక మంచి విషయం అనే చెప్పాలి. శివ సినిమాల్లో ఎమోషన్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది.
మరి ఈ సినిమాలో కూడా ఎమోషన్ ను చాలా హైలెట్ చేసినట్టుగా మనకు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఇక సూర్య భారీ విన్యాసాలతో యాక్షన్ సీన్లలో ఒళ్ళు జలదరించి పోయేలా కనిపించాడు. మరి వీటిలో సూర్య ఎంత వరకు మెప్పిస్తాడు అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం ట్రైలర్ అందర్నీ ఆకర్షిస్తుంది. ఇక తెలుగులో ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి మరొక రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి…