కొత్త నేపథ్యంలో సూర్య క్రేజీ సినిమా !

తమిళ్ స్టార్ హీరో సూర్యకి చాలా సంవత్సరాలు తరువాత ఓ గొప్ప హిట్ వచ్చింది. డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా.. కథ పరంగా అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండటంతో.. సూర్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మరి ఇలాంటి సినిమా తీసిన తరువాత.. మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి. ఇప్పుడు […]

Written By: admin, Updated On : November 13, 2020 4:34 pm
Follow us on


తమిళ్ స్టార్ హీరో సూర్యకి చాలా సంవత్సరాలు తరువాత ఓ గొప్ప హిట్ వచ్చింది. డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా.. కథ పరంగా అందర్నీ ఆకట్టుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా సినిమా ఉండటంతో.. సూర్య కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోనుంది. మరి ఇలాంటి సినిమా తీసిన తరువాత.. మళ్లీ ఎలాంటి సినిమాతో రావాలి. ఇప్పుడు ఇదే విషయాన్ని సూర్య తన తరువాత సినిమా డైరెక్టర్ కి క్లారిటీ ఇచ్చాడట. సూర్య ఇప్పటికే యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కాగా హరికి సూర్య ఈ సారి మనం కొత్తగా చేద్దాం అంటూ లంక ప్రాంతానికి సంబంధించిన ఓ ఐడియాని సూర్య, హారికి చెప్పాడట.

Also Read: రానాపై ప్రశంసలు కురిపిస్తున్న మిహికా.. ఎందుకంటే?

నిజానికి వీరి కలయికలో పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే పల్లెటూరి కథ సినిమాగా రాబోతుందని.. ఇప్పటికే ఇద్దరూ ఓ కథకు కూడా ఫిక్స్ అయ్యారంటూ ఆ మధ్య కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఆకాశం నీ హద్దురా సినిమా సక్సెస్ సూర్య ఆలోచనను మార్చినట్లు ఉంది. అసలు సూర్య – హరి కాంబినేషన్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది.. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో సాగే ఫుల్ యాక్షన్ డ్రామాలు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింగం’ ప్రాంఛైజీలోని యాక్షన్ సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. అందుకే వీరి కలయికలో ఎప్పుడూ సినిమా చేసినా సింగం సిరీస్ తో పోలుస్తారు. అంతలా సూర్య – హరి యాక్షన్ కి కేరాఫ్ అడ్రెస్ లా నిలిచారు.

Also Read: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూసే !

అందుకే ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. కోలీవుడ్ లో మాస్ ప్రేక్షకులకు వీరు అంటేనే ఫుల్ క్రేజ్. మరి ఇప్పుడు లంక నేపథ్యంలో సినిమా అంటే.. కచ్చితంగా కొత్తగా ఉంటుంది. సూర్య గతంలో ఎన్నడూ అలాంటి సినిమా చేయలేదు. పైగా లంక నేపథ్యం పై తమిళ ప్రజలకు కాస్త ఆసక్తి ఎక్కువు ఉంటుంది. మరి చూడాలి ఈ సినిమా ఎలా ఉండబోతుందో. కానీ, సూర్య ఫ్యాన్స్ మాత్రం గతంలో వీళ్లు చేసిన ‘ఆరు, వేల్’ లాంటి డిఫరెంట్ మూవీ ఏదైనా చేస్తే బాగుంటుందని తరుచూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ వస్తున్నారు. ప్రతి సినిమాలో ఏదోకటి కొత్తగా ట్రై చేస్తూ.. వైవిధ్యమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్న సూర్య, తన అభిమానులు కోరుకుంటున్నట్లు మరో ‘గజినీ’, ‘సెవెన్త్ సెన్స్’ లాంటి వైవిధ్యమైన సినిమా ఏదైనా చేస్తాడేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్