Prabhas Surgery: హీరో ప్రభాస్ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనకు సర్జరీ జరగనుందట. ఈ కథనాలు ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రభాస్ స్పీడ్ పెంచారు. బాహుబలి సిరీస్ కోసం ఐదేళ్ల సమయం తీసుకున్న ప్రభాస్ సాహో చిత్రాన్ని కూడా చాలా నెమ్మదిగా చేశాడు. సొంత ప్రొడక్షన్ హౌస్ కావడంతో ఆయన మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా పోయింది. అయితే ఫ్యాన్స్ కనీసం ఏడాదికి ఒక సినిమా చేయాలని డిమాండ్ చేశారు.
వాళ్ళ కోరికను మన్నించిన ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు ప్రకటించారు. గత ఏడాది సమ్మర్ కి రాధే శ్యామ్ విడుదల చేసిన ప్రభాస్ ఇటీవల ఆదిపురుష్ చిత్రంతో పలకరించారు. సెప్టెంబర్ 28న సలార్ విడుదలకు సిద్ధంగా ఉంది. అంటే ఆదిపురుష్-సలార్ చిత్రాల మధ్య కేవలం మూడు నెలల గ్యాప్ మాత్రమే. ప్రభాస్ గత చిత్రాలు నిరాశపరిచిన నేపథ్యంలో సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
మరో భారీ ప్రాజెక్ట్ విడుదలకు సిద్ధం అవుతుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్ట్ మరో ఆరు నెలలు ఆలస్యమయ్యే సూచనలు కలవు. వీటితో పాటు దర్శకుడు మారుతితో చేస్తున్న రాజా డీలక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ ప్రకటించారు. నెక్స్ట్ ఇది మొదలయ్యే అవకాశం ఉంది.
ఇలా ఏక కాలంలో పలు చిత్రాల్లో నటిస్తూ ప్రభాస్ తీరిక లేని సమయం గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆయనను మోకాలి నొప్పి బాధిస్తుందట. సలార్ పనులు పూర్తి కాగానే ఆయన సర్జరీ చేయించుకోవాలని భావిస్తున్నారట. ప్రభాస్ మోకాలికి సర్జరీ జరగనుందనే మాట పరిశ్రమలో వినిపిస్తుంది. సర్జరీ అనంతరం ప్రభాస్ కొన్ని రోజులు పూర్తి విశ్రాంతిలో ఉంటారట. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తోంది.