spot_img
Homeఎంటర్టైన్మెంట్Kalisundam Raa: దేశంలోనే అత్యధికంగా సినిమా టిక్కెట్లు అమ్ముడుపోయిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Kalisundam Raa: దేశంలోనే అత్యధికంగా సినిమా టిక్కెట్లు అమ్ముడుపోయిన తెలుగు సినిమా ఏదో తెలుసా?

Kalisundam Raa: తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అయింది. అత్యున్నత ఆస్కార్ బరిలోనూ మన సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే.. ఇండస్ట్రీకి రికార్డులు కొత్తేమి కాదని తెలుస్తోంది. గత కాలంలోనే కొన్ని తెలుగు సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఆ కాలంలోనే తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు ఎక్కువ లాభాలు తెచ్చాయి. వాటిలో ఓ సినిమాకు దేశంలోనే అత్యధికంగా టిక్కెట్లు అమ్ముడుపోయిన రికార్డు ఉంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ మెగాస్టార్ మూవీని తట్టుకొని మరీ అత్యధిక సెంటర్లలో ఎక్కువ రోజులు నడిచింది. ఇంతకీ ఆ సినిమా గురించి వివరాల్లోకి వెళితే..

2000 సంవత్సరంలో తెలుగు సినిమాలు పోటీ పడి థియేటర్ లోకి వచ్చాయి. ఈ సమయంలో ఆడియన్స్ కు మంచి వినోదం అంటే సినిమా చూడడమే. అందుకే కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. వాటిలో ‘కలిసుందాం రా’ ఒకటి. విక్టరి వెంకటేష్ నటించిన ఈ మూవీ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా అలరిస్తుంది. ఆ సమయంలో వెంకీ వరుసగా ఫ్యామిలీ చిత్రాల్లో నటించడంతో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో వచ్చిన ‘కలిసుందాం రా’ కూడా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది.

ఉదయ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘కలిసుందాం..రా’ సినిమాలో వెంకటేశ్ కు జోడిగా సిమ్రన్ నటించారు. అంతకుముందు ఈ మూవీ కోసం అంజలా జవేరి ని అనుకున్నారు. కానీ అనూహ్యంగా సిమ్రన్ కు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సిమ్రన్ ఉపయోగించుకున్నారు. ఈ సినిమాలో శ్రీహరి, రంగనాథ్, విశ్వనాథ్ శర్మ, రాళ్లపల్లి,బ్రహ్మానందం లాంటి లెజెండ్స్ నటించారు. కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని కలగలిపి ఉన్న ఈ సినిమా ముందుగా 78 కేంద్రాల్లో మాత్రమే రిలీజ్ అయింది. అందుకు కారణం ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ‘అన్నయ్య’ థియేటర్ లోకి రావడమే.

మొదట్లో తక్కువ థియేటర్లలో రిలీజ్ అయినా ఆ తరువాత సినిమా గురించి తెలిశాక థియేటర్ల సంఖ్య పెరిగింది. అంతేకాకుండా చాలా థియేటర్లలో 50 రోజులు నడిచింది. ఇలా 14 సెంటర్లలో 175 రోజులు 4 థియేటర్లలో 200 రోజులు నడిచి రికార్డుల్లోకెక్కింది.ఇలా 200 రోజుల పాటు నడిచిన ఈ సినిమాకు మొత్తంగా 2 కోట్ల 50 వేల టిక్కెట్లు అమ్ముడు పోయాయి. ఈ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేదంటే మాటలు కాదు. సింపుల్ గా థియేటర్లోకి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఏకైక సినిమాగా ‘కలిసుందాం..రా’ నిలుస్తుంది. ఇక ఈ సినిమాను రూ.4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా.. రూ.25 కోట్లు గ్రాస్ చేసింది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version