సురేష్ బాబు తెలివిగా అమ్మేశాడు !

విక్టరీ వెంకటేష్ నారప్ప ట్రైలర్ తో థ్రిల్ చేశారు, ముఖ్యంగా ద్విపాత్రాభినయంతో. అయితే వెంకీకి ద్విపాత్రాభినయం కొత్త ఏమి కాదు. బాగా అలవాటు ఉన్న వ్యవహారమే. కాకపోతే, నారప్పలో చేసిన క్యారెక్టర్స్ వేరు. ఒకే రూపంతో ఉన్న పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్లు. పైగా ఈ సినిమా రీమేక్ కూడా. అసలు రీమేకుల స్టార్ గా వెంకీకి ఒకప్పుడు పేరు ఉండేది. ఎందుకంటే వెంకీ కెరీర్ లో ఎక్కువ శాతం రీమేక్ లే. ఈ క్రమంలో చేసిన మరో […]

Written By: admin, Updated On : July 15, 2021 12:54 pm
Follow us on

విక్టరీ వెంకటేష్ నారప్ప ట్రైలర్ తో థ్రిల్ చేశారు, ముఖ్యంగా ద్విపాత్రాభినయంతో. అయితే వెంకీకి ద్విపాత్రాభినయం కొత్త ఏమి కాదు. బాగా అలవాటు ఉన్న వ్యవహారమే. కాకపోతే, నారప్పలో చేసిన క్యారెక్టర్స్ వేరు. ఒకే రూపంతో ఉన్న పూర్తి ఆపోజిట్ క్యారెక్టర్లు. పైగా ఈ సినిమా రీమేక్ కూడా. అసలు రీమేకుల స్టార్ గా వెంకీకి ఒకప్పుడు పేరు ఉండేది. ఎందుకంటే వెంకీ కెరీర్ లో ఎక్కువ శాతం రీమేక్ లే.

ఈ క్రమంలో చేసిన మరో రీమేక్ ఈ నారప్ప. త్వరలో అమెజాన్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తమిళ సినిమా ‘అసురన్’ అనే చిత్రానికి ఆధారంగా తీసిన ఈ సినిమాలో వెంకీ డబుల్ రోల్ కి సంబంధించి ఆయన ఫ్యాన్స్ టెన్షన్ ఫీల్ అవుతున్నారు. అసురన్ లో తండ్రిగా, కొడుకుగా ధనుష్ మెస్మరైజ్ చేశాడు. అందుకే అసురన్ తో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు ధనుష్.

అయితే అసురన్ కథతో నారప్ప వస్తోంది. కానీ తండ్రీకొడుకుల పాత్రల్లో వెంకటేష్ నటిస్తున్నాడు. ధనుష్ అంటే నలభై ఏళ్ల హీరో. ఇటు కొడుకు పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. అటు తండ్రి పాత్రకు కూడా సూటయ్యాడు. కానీ వెంకటేష్ 60 ప్లస్ హీరో. తండ్రికి పాత్రకు సరిగ్గా సరిపోతారు. కానీ కొడుకు పాత్రలో సెట్ అవుతారా ? ఒకటి రెండు సీన్స్ కు అంటే మ్యానేజ్ చెయ్యొచ్చు.

కానీ కొడుకు పాత్ర నిడివి కూడా దాదాపు నలభై నిమిషాలు ఉంటుందట. మరి వెంకీ యువకుడిగా మెప్పించగలరా? ఇప్పుడే ఇదే పెద్ద సమస్య అయింది. ఈ పాత్ర సరిగ్గా రాలేదు అని, అందుకే సురేష్ బాబు తెలివిగా సినిమాని ఓటీటీకి అమ్మేశాడని తెలుస్తోంది. ఇప్పుడు సినిమాకి వచ్చే రిపోర్ట్స్ బాగున్నా, బాలేకపోయినా నిర్మాతలకు ఫరక్ పడదు కాబట్టి, సురేష్ బాబు సేఫ్.