తెరముందు ఒకలా.. తెరవెనుకలా ఒకలా నటులు ఉంటారు. హీరోయిన్లు కూడా అంతే.. ఒకప్పుడు హీరోయిన్ గా వెలుగు వెలిగిన కస్తూరి.. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ గా మారింది. మా టీవీలో వచ్చే ‘గృహలక్ష్మీ’ సీరియల్ లో ప్రధానపాత్రలో నటిస్తోంది. ఆ సీరియల్ పాపులర్ కావడం.. కస్తూరి పద్దతిగల గృహలక్ష్మిలా తెలుగు ప్రజలకు చేరువ అయ్యింది. అయితే నిజానికి కస్తూరి అంతపద్ధతిగా ఉండదని ఆమె బయటి ఫొటోలు చూస్తే కనిపిస్తోంది.
కస్తూరి అప్పట్లో హీరోయిన్ గా మెరిసింది. 1991లో ‘ఆత ఉన్ కోయిలి’ అనే తమిళ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తరువాత 1996లో కమలాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమాలో ఆయన చెల్లెలుగా నటించి అందరికీ చేరువైంది. ‘పచ్చని చిలుకలు తోడుంటే..’ పాటలో కస్తూరి హావభావాలు ఇప్పటికీ మరిచిపోలేం. ఇక తెలుగులో నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ చిత్రంలో నాగార్జున పక్కన భార్యగా నటించి అలరించింది. ఆ తరువాత పెళ్లి చేసుకొని ఈమె అమెరికాలో స్థిరపడింది.
ఆ తర్వాత చాలా గ్యాప్ కు తిరిగి ఇండియాకు వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కస్తూరి కెరీర్ ను మొదలు పెట్టింది. తెలుగులో ‘గృహలక్ష్మి’ సీరియల్ లో నటిస్తోంది. ఈ సీరియల్లో ఎంతో సాంప్రదాయంగా కనిపిస్తున్న కస్తూరి ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్. తమిళం, కన్నడ సినిమాల్లో ఆమె అందాల ఆరబోతకు యూత్ ఫిదా అయ్యేవారు. ఆప్పటి ఫొటోలను కొందరు ఇప్పుడు బయటకు తీసి వైరల్ చేసేస్తున్నారు.
తాజాగా కస్తూరికి సంబంధించిన హాట్ హాట్ ఫొటోస్ ను కుర్రాళ్లు సోషల్ మీడియాలో షేర్లు చేస్తూ మన గృహలక్ష్మీ చాలా హాట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.. టీవీల్లో కనిపించే కస్తూరి ఎలా ఉందో చూడండంటూ ట్యాగ్లు ఇస్తున్నారు. కస్తూరి గ్లామర్ షో ను చూసి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.కస్తూరి ప్రస్తుతం ‘గృహలక్ష్మి’ అనే సీరియల్ లో మెయిన్ రోల్ చేస్తోంది. ఈ సీరియల్ సక్సెస్ ఫుల్ గా రన్ అవడంతో కస్తూరి కూడా ప్రముఖ నటిగా పేరు తెచ్చుకుంది.