Star Director Daughter: దర్శకుడు శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య శంకర్ నిశ్చితార్థం ఆదివారం చెన్నైలో ఘనంగా జరిగింది. ఐశ్వర్య శంకర్ కి కాబోయే భర్త పేరు తరుణ్ కార్తీక్. ఈయన శంకర్ దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ అని సమాచారం. ఐశ్వర్యకు ఇది రెండో వివాహం. గతంలో ఆమె పాండిచ్చేరి క్రికెట్ టీమ్ కెప్టెన్ రోహిత్ దామోదరన్ ని వివాహం చేసుకున్నారు. రోహిత్ తో ఆమె వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. ఏడాది లోపే మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు.
రెండో వివాహంగా తరుణ్ కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. ఐశ్వర్య తండ్రి శంకర్ వద్ద తరుణ్ కార్తీ అసిస్టెంట్ దర్శకుడిగా పని చేస్తున్నాడట. తనకు బాగా తెలిసిన తరుణ్ కార్తీక్ ని కూతురికి భర్తగా తెచ్చాడు. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాలకు తరుణ్ కార్తీక్ అసిస్టెంట్ దర్శకుడిగా చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఐశ్వర్య-తరుణ్ కార్తీక్ ల వివాహం జరగనుంది.
శంకర్ కి ముగ్గురు సంతానం. రెండో అమ్మాయి అదితి శంకర్. ఈమె నటిగా సింగర్ గా రాణిస్తుంది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రం చేసింది. అలాగే శివ కార్తికేయన్ హీరోగా విడుదలైన మావీరన్ మూవీలో హీరోయిన్ పాత్ర చేసింది. ప్రస్తుతం ఆమె ఓ చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ గని మూవీలో అదితి శంకర్ ఒక పాట పాడింది. శంకర్ కి అబ్బాయి కూడా ఉన్నాడు. పేరు అర్జిత్ శంకర్.
మరోవైపు శంకర్… ఏక కాలంలో గేమ్ ఛేంజర్, భారతీయుడు 2 చిత్రాలు తెరకెక్కిస్తున్నాడు. భారతీయుడు 2 షూటింగ్ వివాదాలతో ఆగిపోయింది. కమల్ హాసన్ విక్రమ్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యారు. ఈ క్రమంలో నిర్మాతలు భారతీయుడు 2 ని పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ కారణంగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ ఆలస్యం అవుతుంది. ఈ ఏడాది భారతీయుడు 2, గేమ్ ఛేంజర్ విడుదల కానున్నాయి. గేమ్ ఛేంజర్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.