https://oktelugu.com/

హైదరాబాద్ కు బై అంటున్న సురేఖా వాణి !

టాలీవుడ్ లో అక్కలు అమ్మల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో సురేఖా వాణి కూడా ఒకరు. మంచి అయినా, కాస్త ఆవేశం అయినా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ఆమెను ఫాలో అయ్యేవారికే అర్ధం అవుతుంది. అయితే ఇన్నేళ్లు సురేఖా ఒక్కత్తే కుర్రాళ్లను సినిమా అభిమానులను అలరిస్తూ వస్తుంటే.. వెలితిగా ఉందనుకుందే ఏమో.. తన రూట్ లోకే తన కుమార్తెను కూడా తీసుకువచ్చి ఆమెను కూడా నటిగా మార్చడానికి […]

Written By:
  • admin
  • , Updated On : September 2, 2020 / 05:07 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో అక్కలు అమ్మల పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల్లో సురేఖా వాణి కూడా ఒకరు. మంచి అయినా, కాస్త ఆవేశం అయినా సోషల్ మీడియాలో ఆమె చేసే రచ్చ గురించి ఆమెను ఫాలో అయ్యేవారికే అర్ధం అవుతుంది. అయితే ఇన్నేళ్లు సురేఖా ఒక్కత్తే కుర్రాళ్లను సినిమా అభిమానులను అలరిస్తూ వస్తుంటే.. వెలితిగా ఉందనుకుందే ఏమో.. తన రూట్ లోకే తన కుమార్తెను కూడా తీసుకువచ్చి ఆమెను కూడా నటిగా మార్చడానికి సురేఖా వాణి బాగానే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్లుగానే సురేఖతో పాటు ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ముందుకు పోతొంది.

    Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్

    ముఖ్యంగా టిక్ టాక్ ఉన్నంత కాలం సుప్రిత ఓ రేంజ్ లో హంగామా చేసింది. పైగా సురేఖా వాణి చేత కూడా టిక్ టాక్ వీడియోలు చేయించి నెటిజన్లు బాగా ఆకట్టుకుంది. మెయిన్ గా ఈ లాక్ డౌన్ లో ఈ తల్లీ కూతుళ్లిద్దరూ కలిసి డ్యాన్సులు చేసి తామూ హీరోయిన్స్ కు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకున్నారు. అన్నిటికి కంటే ముఖ్యంగా బెడ్రూంలో కాలా చష్మా అంటూ పొట్టి బట్టలు వేసుకుని ఇద్దరూ చేసిన డ్యాన్సులకు కుర్రకారు ఫిదా అయిపోయింది. ఇక ఈ మధ్య సురేఖా తన కూతురు బర్త్ డేను ఘనంగా సెలెబ్రేట్ చేయడంతో పాటు స్పెషల్‌గా ఈవెంట్ మేనేజర్ లతో మాట్లాడి ఇళ్లంతా ప్రత్యేకంగా అలకరించి మరీ తన కూతురికి పెద్ద సర్ ప్రైజ్ గిఫ్ట్ నే ఇచ్చింది. తానూ తన కూతురుకి బెస్ట్ ఫ్రెండ్ అంటూ.. మొత్తానికి కూతురు కంటే కూడా.. సురేఖా వాణినే ఎక్కువ అల్లరి చేస్తోంది.

    Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్

    అయితే ఇక నుండి కొన్ని రోజులు పాటు సురేఖా వాణి, ఆమె గారాల కూతురు హైదరాబాద్ కు బాయ్ చెప్పేస్తున్నారు. తాజాగా తామూ హైద్రాబాద్‌ ను విడిచివెళ్లినట్టు.. కొన్ని రోజులు పాటు తన గ్యాంగ్‌ను మిస్ అవ్వక తప్పదు అని సురేఖా వాణి తెలిపింది. అలాగే తన ఫ్లైట్ టికెట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. హైద్రాబాద్‌కు బై అని కామెంట్ పెట్టింది. ఇంతకీ ఈ తల్లీకూతుళ్లు ఎక్కడకి వెళ్లారు అని, వాళ్ళ ఫాలోవర్స్ తో పాటు, నెటిజన్లు కూడా తెగ ఆరా తీస్తున్నారు. సురేఖా వాణి పోస్ట్ చేసిన టికెట్‌లో మాత్రం జైపూర్ అని ఉంది. అంటే సురేఖా వాణి తన కూతురుతో కలిసి జైపూర్ వెళ్లి ఉంటుంది. మరి జైపూర్ ఎందుకు వెళ్లారో ఇంకా తెలియదు. అయితే ఈ కరోనా కాలంలో జైపూర్ కి వెళ్ళారు అంటే.. బహుశా అక్కడ వారికి దగ్గర బంధువులు ఉండి ఉంటారని.. వారి కోసమే వెళ్ళి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.