వైయస్సార్ ను అడ్డం పెట్టుకొని జగన్ కు మంట పెట్టిన ఎంపీ రాజు..?

ఏపీ రాష్ట్ర అధికార పార్టీ వివాదాస్పద పార్లమెంటు సభ్యుడు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి వార్తల్లోకెక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన…. సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన రాజుగారికి లోపల ఎంత ఉందో తెలియదు గాని… ఆయన మాత్రం వైఎస్ఆర్ పరమభక్తుడనని రాజు చెప్పుకుంటాడు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి అయిన నేపథ్యంలో ఆయన ఫోటో పై పూలు కురిపించి నివాళులు అర్పించిన ఎంపీ రాజు ఈ సంధర్భంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలను రాజశేఖర్ రెడ్డి […]

Written By: Navya, Updated On : September 2, 2020 5:05 pm
Follow us on

ఏపీ రాష్ట్ర అధికార పార్టీ వివాదాస్పద పార్లమెంటు సభ్యుడు, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరొకసారి వార్తల్లోకెక్కారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పైన…. సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన రాజుగారికి లోపల ఎంత ఉందో తెలియదు గాని… ఆయన మాత్రం వైఎస్ఆర్ పరమభక్తుడనని రాజు చెప్పుకుంటాడు. ఈరోజు వైఎస్ఆర్ వర్ధంతి అయిన నేపథ్యంలో ఆయన ఫోటో పై పూలు కురిపించి నివాళులు అర్పించిన ఎంపీ రాజు ఈ సంధర్భంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలను రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పడం గమనార్హం.

ఎంపీ రాజు మాట్లాడుతూ…. ఒక సారి ఏదో న్యూస్ పేపర్ లో చంద్రబాబు నాయుడు ఫోటో ని కార్టూన్ లాగా గీసిన బొమ్మ ను తాను రాజశేఖర్ రెడ్డికి చూపించానని…. అయితే వెంటనే అతను అది చూసి సీరియస్ అయిపోయి న్యూస్ పేపర్ ని పక్కకి విసిరి కొట్టారు అని ఆయన అన్నారు. ఇది ఏమీ బాగోలేదు అని…. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తిని ఇలా కించపరచడం తగదని వైఎస్ అన్నట్లు చెప్పారు. ఎన్నో సంవత్సరాల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఇలా చేయడం అవమానించినట్లే అని…. చంద్రబాబు నాయుడు పట్ల మనం ఎప్పుడడూ గౌరవాన్ని చూపించాల్సిందే అని వైఎస్ చెప్పినట్లుగా రాజు గుర్తుచేసుకున్నారు.

“ఆయన సంస్కారానికి ఆ రోజున మనసులోనే నమస్కారం పెట్టాను” అంటూ ఆ సందర్భంలో రాజు గారు తన ఫీలింగ్ గురించి వెల్లడించారు. ఇతరులను గౌరవించడం వల్లే అతను లెజెండ్ లా ఎదిగారని రాజు గారు చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ వార్తలన్నీ అటు టిడిపి సపోర్టర్లు జగన్ ను ఉద్దేశించి చేసినట్లుగా అంటున్నారు. జగన్ చంద్రబాబు పైన అసెంబ్లీలో విరుచుకుపడుతున్న తీరు…. ఎప్పటికప్పుడు వైసిపి నేతలు బాబుని ఎన్ని రకాలుగా కావాలంటేఅన్ని రకాలుగా అవమానించిన వైనాన్ని రాజు ఇప్పుడు ఎత్తిచూపుతున్నారని అంటున్నారు.

అంతేకాకుండా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ వైఎస్ ఏనాడూ తన పథకాలకు తన పేరు పెట్టలేదని…. రాజీబ్ గాంధీ పేరు, ఇందిరా గాంధీ పేర్లు మాత్రమే పెట్టారు అని గుర్తు చేశాడు. ఇప్పుడు జగన్ తన పథకాలకు ‘జగనన్న’ అని కొన్నిటికి ముందు తన పేరుని ట్యాగ్ లా తగిలించుకున్న విషయాన్ని రాజు తప్పు అని చెప్పడమేనా ఇది…? అని వైసిపి వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఏదైనా ఈమధ్య రాజు ఏది చేసినా సెన్సేషన్…. ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అయిపోతోంది.