సింగర్ సునీత.. ఆమె గాత్రం ఎంత కమ్మగా ఉంటుందో.. ఆమె చీర కట్టు ఆమెలోని తెలుగుతనం అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పటి హీరోయిన్స్ కంటే.. ఎంతో అందంగా కనిపించే సునీతకు అభిమానులు కూడా విశేషంగానే ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా సునీత గురించి వస్తోన్న ప్రధాన న్యూస్. ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతుంది అని. ఈ న్యూస్ లో ఎంత వాస్తవం ఉందో తెలియకుండానే డైరెక్ట్ గా సునీత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంది అంటూ వెబ్ మీడియాలో తెగ రాసేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే బిగ్ బాస్ సందడి మొదలైంది. రెండు వారాల క్రితమే షూటింగ్ కూడా మొదలైందనేది లేటెస్ట్ సమాచారం. ఇక ఈ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు బిగ్ బాస్ సీజన్ 4 నాగార్జున హోస్ట్ గా అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది.
Also Read: టాలీవుడ్ డ్రగ్స్ దందాపై హీరోయిన్ కామెంట్? పోలీసుల కౌంటర్
అందుకే నెటిజన్లు కూడా బిగ్ బాస్ లోకి సునీత వెళ్తుందని వస్తోన్న వార్తలను ఈజీగా నమ్మేశారు. అయితే తన పై వచ్చే రూమర్స్ కు ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చే అలవాటు ఉన్న సునీత, తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే వారి లిస్ట్ లో తన పేరు కూడా బాగా వినిపించడంతో.. ఇక ఆమెనే నేరుగా ఈ వార్త పై స్పందిస్తూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అని వస్తోన్న వార్తలను ఆమె ఖండిస్తూ.. ‘డియర్ ఫ్రెండ్స్, బయట వస్తోన్న వార్తలను బట్టి నేను బిగ్ బాస్ హౌస్ నాలుగో సీజన్ లో పాల్గొనబోవడం లేదు. నాకు ఎలాంటి ఆసక్తి లేదు. అందుకే నేను పాల్గొనబోను కూడా.. అంటూ దండం పెట్టి.. నా పై వస్తోన్న ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మీకు తెలియడానికే నేను ఈ పోస్ట్ పెడుతున్నాను’ అని మొత్తానికి సునీత స్పష్టంగా తెలిపింది.
Also Read: పవర్ స్టార్ బర్త్ డే రెండో గిప్ట్.. #PSPK27 ప్రీ లుక్ రిలీజ్
ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే ఆ పదిహేను, పదహారు మంది కంటెస్టెంట్లు ఎవరై ఉంటారా అని నెటిజన్లు వారి పేర్లు తెలుసుకోవడానికి తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు వంద రోజుల పాటు సాగే ఈ నాలుగో సీజన్ లో కాస్త మసాలా గేమ్స్ ఉంటాయని.. అలాగే ఎక్కువగా అమ్మాయిలను షోలోకి తీసుకువచ్చి వారితో ఉండే అబ్బాయిలకు మధ్య కాస్త కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా షోను ప్లాన్ చేశారని.. గత సీజన్స్ కంటే.. ఈ సారి సీజన్ బాగా బోల్డ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక హౌస్ లోకి వెళ్లే.. కంటెస్టెంట్ల లిస్ట్ ను ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం చూస్తే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సనా, సింగర్ నోయెల్, దేత్తడి హారిక, దివి, లాస్య, గంగవ్వ, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, దేవీ నాగవల్లి, సోహెల్, ముక్కు అవినాష్, దిల్ సే మెహబూబా, రఘు మాస్టర్, యాంకర్ సుజాత, మోనాల్, అభిజీత్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో చాలామంది పేర్లు మెజార్టీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం కూడా లేదు. మరీ వీళ్ళు హౌస్ లో ఉన్నంత మాత్రాన ఏమి ఇంట్రస్ట్ వస్తోందనేది చూడాలి.