
వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా క్యూట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత. తమ తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ చేసేప్పుడే ప్రేమలో పడ్డ ఈ యువ జంట మూడేళ్ల కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అప్పటినుంచి చాలా అన్యోన్యంగా తమ దాంతప్య జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఒక్కచోట గడిపేందుకు వీళ్లకు సమయం లభించింది. లాక్‌డౌన్ విరామంలో వర్కౌట్స్, ఇంటి పనులు, వంట పనులు కలిసి చేసుకున్న చై, సామ్ ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఏప్రిల్‌లో తన పుట్టిన రోజును సమంత ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంది. భర్త చైతన్య.. ఆమె కోసం ప్రత్యేకంగా కేక్ తయారు చేసి ఆ రోజు మరింత తీపిగా మార్చాడు. ఆ ఫొటోలు, వీడియోలను సైతం సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగచైతన్య పుట్టిన రోజు కోసం సమంత ఏర్పాట్లు చేస్తోంది.
Also Read: టాలెంటెడ్ డైరెక్టర్ కి తీవ్ర అవమానం !
చైతూ పుట్టిన రోజు నవంబర్23. దానికి ఇంకా చాలా టైముంది. మరి, ఇప్పటి నుంచే ఏర్పాట్లు ఎందుకు అనుకుంటున్నారా? దాని వెనుక బలమైన కారణమే ఉంది. ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ కెరీర్ పరంగా సమంత చాలా ముందుంది. చాలా తక్కువ టైమ్‌లోనే స్టార్హీరోయిన్‌గా మారిందామె. తెలుగు దాదాపు అందరు స్టార్లతో వర్క్ చేసి హీరోలకు సమానమైన పేరు తెచ్చుకుంది. మరోవైపు నాగచైతన్య ఖాతాలో కొన్ని హిట్లు ఉన్నప్పటికీ అతని కెరీర్ ఆశించినంత వేగంతో ముందుకెళ్లడం లేదు. ఇంకా లవర్ బాయ్, పక్కింటి కుర్రాడి ఇమేజ్‌తోనే బండి నడుస్తోంది. ఇక లాభం లేదు.. తన భర్త స్టార్డమ్ ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాలని, కెరీర్ స్పీడు పెంచాలని సమంత రంగంలోకి దిగింది.
Also Read: పక్కన మగాడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు: సీనియర్ నటి
ఈ విషయంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య నమ్రతను ఫాలో అవ్వాలని చూస్తోందట. పెళ్లి తర్వాత నటనకు దూరమైన నమ్రత.. ఇల్లు, భర్త కోసం ఆవిశ్రాంతంగా పని చేస్తోంది. మహేశ్ బిజినెస్, మార్కెటింగ్ మొత్తం ఆమెనే చూస్తుంది. కొత్త దర్శకుల స్టోరీలను కూడా ముందుగా ఆమెనే వింటుంది. సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్స్‌ను కూడా పర్యవేక్షిస్తుంది. మహేశ్ సోషల్ మీడియా టీమ్ కు కూడా ఆమెనే మార్గనిర్దేశం చేస్తుందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో సమంత కూడా నమ్రత మాదిరిగా తన భర్త నాగ చైతన్య ను ప్రమోట్ చేయాలని భావిస్తోంది. ముందుగా సోషల్ మీడియా ద్వారా చైతూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచాలని చూస్తోంది. ఈ క్రమంలో కొన్ని నెలల ముందే చైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ గురించిన ప్రస్తావన తెచ్చింది. తన పీఆర్ టీమ్‌తో కలిసి చైతూను సోషల్ మీడియా సెన్సేషన్‌గా మార్చాలని చూస్తోందట. సామ్ ప్రయత్నంతో ఇప్పటికే చైతూ ఫ్యాన్స్ అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో హైప్ మొదలు పెట్టారు. మున్ముందు కథల ఎంపికలో కూడా తన భర్తకు సలహాలు ఇవ్వాలని, అవసరం అయితే ప్రమోషన్స్ కూడా హాజరు కావాలని సమంత భావిస్తోందట. భర్త కోసం ఆమె చేసే ప్రయత్నాలు ఎంత సక్సెస్ అవుతాయో చూడాలి.