https://oktelugu.com/

Surekha Vani Daughter: అమ్మకు రెండో పెళ్లి చేస్తా, కుర్రాళ్ళు సరిపోరు, అంకుల్స్ కావాలి… సురేఖావాణి కూతురు క్రేజీ కామెంట్స్

నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకోకపోయినా, డేటింగ్ కి సిద్ధం అని ఓపెన్ అయ్యింది. మంచి హైట్, ఫిజిక్, నిండు గడ్డం కలిగినవాడు కావాలని నిస్సంకోచంగా చెప్పింది.

Written By:
  • S Reddy
  • , Updated On : March 28, 2024 / 05:18 PM IST

    Surekha vani daughter Supritha crazy comments

    Follow us on

    Surekha Vani Daughter: సురేఖావాణి భర్త మరణించి దాదాపు ఐదేళ్లు అవుతుంది. 2019లో ఆయన కన్నుమూశారు. అప్పటి నుండి కూతురితో పాటు సురేఖావాణి ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలో పలుమార్లు సురేఖావాణి పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. మొదట్లో ఈ వార్తలను సురేఖావాణి కూతురు సుప్రీత ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగత విషయాలు రాయకండని ఆమె మండిపడింది. అయితే సురేఖావాణి అప్పుడప్పుడు మనసులోని రెండో పెళ్లి ఆలోచన బయటపెట్టింది.

    నచ్చినవాడు దొరికితే పెళ్లి చేసుకోకపోయినా, డేటింగ్ కి సిద్ధం అని ఓపెన్ అయ్యింది. మంచి హైట్, ఫిజిక్, నిండు గడ్డం కలిగినవాడు కావాలని నిస్సంకోచంగా చెప్పింది. తాజాగా సురేఖావాణి కూతురు సుప్రీత తల్లి పెళ్లి గురించి కొన్ని క్రేజీ కామెంట్స్ చేసింది. సురేఖావాణికి మరో పెళ్లి చేసే ఆలోచన ఉన్నట్లు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుప్రీతను సురేఖావాణికి రెండో వివాహం చేసే ఆలోచన ఉందా… అని అడగడం జరిగింది.

    దీనికి సమాధానంగా… అవును అమ్మకు రెండో పెళ్లి చేయాలి. నాకు ఆ ఆలోచన ఉంది. అయితే అమ్మకు అబ్బాయిలు సెట్ కారు. అంకుల్స్ అయితే సెట్ అవుతారు. ఒక మంచి అంకుల్ ని వెతికే పనిలో ఉన్నాను. అమ్మను బాగా చూసుకోవాలి. అలాగే చెడు ఆలోచనలు లేనివాడై ఉండాలి. ఈ లక్షణాలున్న అంకుల్ దొరికితే పెళ్లి చేసేస్తా… అని సుప్రీత అన్నారు. గతంలో రెండో పెళ్లి అంటే మండిపడిన ఆమె ఇప్పుడేమో తానే స్వయంగా తల్లికి భర్తను వెతుకున్నట్లు చెప్పింది.

    మరోవైపు సుప్రీత హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ కి జంటగా ఓ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తుంది. కొద్దిరోజుల క్రితం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంచ్ అయ్యింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. డెబ్యూ మూవీతో సుప్రీత ఎలాంటి మ్యాజిక్ చేస్తుంది. ఇక కూతురిని హీరోయిన్ చేయాలన్న సురేఖావాణి కల నెరవేరింది. అయితే తెలుగు హీరోయిన్స్ కి టాలీవుడ్ లో అంత ప్రోత్సాహం ఉండదు.