https://oktelugu.com/

Chaitanya – Shobhita : శోభితాని నాగ చైతన్యకి పరిచయం చేసింది అతనేనా..? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!

మోడలింగ్ రంగం మీద అమితాసక్తి ఉన్న శోభిత మిస్ ఇండియా పోటీలలో గెలిచి మిస్ ఇండియా టైటిల్ ని అందుకుంది. అలా ఈమె ఫిలిం మేకర్స్ దృష్టిలో పడడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2024 / 09:20 PM IST

    Supriya introduced Shobhita to Naga Chaitanya

    Follow us on

    Chaitanya – Shobhita : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నాగ చైతన్య, శోభిత సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెల నాల్గవ తేదీన ఈ జంట అన్నపూర్ణ స్టూడియోస్ లో బంధు మిత్రులు, సినీ ప్రముఖులు సమక్ష్యం లో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ వివాహ తేదీని అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా అభిమానులకు తెలపనుంది. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది?, ఎలా ప్రేమించుకున్నారు? అనేది ఇప్పటికీ మిస్టరీ గానే ఉన్న విషయం తెలిసిందే. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. కనీసం కలిసి ఒక కమర్షియల్ యాడ్ లో కూడా కనిపించలేదు. అలాంటి వీళ్లిద్దరి మధ్య ఎలా ఇంతటి రిలేషన్ ఏర్పడింది అని అభిమానులకు అర్థం కాలేదు. అయితే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడడానికి ఒకరు కారణం అని రీసెంట్ గానే తెలిసింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే శోభిత దూళిపాళ్ల అడవి శేష్ తో ‘గూఢచారి’ అనే చిత్రం చేసింది. ఇదే తెలుగులో ఆమెకి మొదటి సినిమా. ఈ చిత్రంలో నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ ని మ్యానేజ్ చేస్తున్నది ఈమెనే. పవన్ కళ్యాణ్ మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమె మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. చాలా కాలం తర్వాత ‘గూఢచారి’ చిత్రంతోనే ఆమె ఇండస్ట్రీ లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో సుప్రియ కి శోభిత బాగా క్లోజ్ అయ్యింది. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అక్కినేని కుటుంబం లో మూడవ తరం గ్యాంగ్ మొత్తం ప్రైవేట్ పార్టీలు చేసుకునే ప్రతీసారి సుప్రియ శోభిత ని పిలిచేది.

    అయితే ఒకసారి ఈ పార్టీ కి నాగ చైతన్య కూడా వస్తాడు. సుప్రియ శోభిత ని నాగ చైతన్య కి పరిచయం చేసింది. అలా ఏర్పడిన వీళ్లిద్దరి మధ్య మొదటి పరిచయం, రోజులు గడిచే కొద్దీ స్నేహం గా మారింది. ప్రతీసారి పార్టీలలో వీళ్లిద్దరు కలుసుకునేవారు, చాలా సన్నిహితంగా మాట్లాడుకునేవారు. అలా ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి, డేటింగ్ చేసుకునే వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని నాగార్జున కి చెప్పిన వెంటనే ఆయన కూడా చాలా సంతోషించాడు. వెంటనే పెళ్ళికి ఓకే చెప్పేసాడు. అలా వీళ్ళ లవ్ స్టోరీ మొదలై పెళ్లి పీటల వరకు వచ్చింది. శోభిత దూళిపాళ్ల అచ్చ తెలుగు అమ్మాయి. తెనాలి ప్రాంతంలో పుట్టిపెరిగిన ఈమె కుటుంబం వైజాగ్ లో స్థిరపడింది . మోడలింగ్ రంగం మీద అమితాసక్తి ఉన్న శోభిత మిస్ ఇండియా పోటీలలో గెలిచి మిస్ ఇండియా టైటిల్ ని అందుకుంది. అలా ఈమె ఫిలిం మేకర్స్ దృష్టిలో పడడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.