Nagarjuna Role in Coolie: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) మేనియా నే కనిపిస్తుంది. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రం లో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది అభిమానులు ఉన్నప్పటికీ కూడా, ఇలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. అభిమానులు ఈ విషయం లో కాస్త నిరాశలో ఉన్నారు. ఎందుకంటే నాగార్జున తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు ఇప్పటికీ నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ హిట్స్ ని అందుకుంటున్నారు. కానీ నాగార్జున మాత్రం ఈ సరికొత్త దారిలో వెళ్లడం వాళ్లకు ఏ మాత్రం నచ్చడం లేదు.
Also Read: ‘కూలీ’ లో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ సన్నివేశం..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
జూన్ నెలలో విడుదలైన ‘కుబేర’ చిత్రం లో నాగార్జున కి మంచి క్యారక్టర్ దక్కింది. కానీ మెయిన్ రోల్ కాకపోవడం తో అక్కినేని ఫ్యాన్స్ మొదటి రోజు సోషల్ మీడియా లో చాలా ఫైర్ అయ్యారు. అంత మంచి పాత్రకే అభిమానులు హర్ట్ అయితే, ఇక విలన్ క్యారక్టర్ ని అసలు అంగీకరించగలరా అనే సందేహాలు విశ్లేషకుల్లో ఉన్నాయి. అయితే ఈ క్యారక్టర్ ని నాగార్జున కంటే ముందుగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ని అడిగారట. కానీ బాలకృష్ణ అందుకు ససేమీరా ఒప్పుకోలేదట. ముఖ్యమైన పాజిటివ్ రోల్ అయితే చేస్తాను కానీ, ఇతర హీరోల సినిమాల్లో నెగిటివ్ రోల్ చేసే ప్రసక్తే లేదు అని ముఖం మీదనే చెప్పేశాడట. ఇక ఆ తర్వాత నాగార్జున ని సంప్రదించడం, ఆయన ఒకటికి ఆరు సార్లు కథ విని ఓకే చెప్పడం జరిగింది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కూలీ లో రజనీకాంత్ క్యారక్టర్ కంటే నాగార్జున క్యారక్టర్ నే అద్భుతంగా వచ్చిందట.
Also Read: కూలీ మూవీ.. నాగార్జునే నిలబెట్టాడా? ట్రెండ్ అలానే ఉంది…
సినిమా చూసి థియేటర్ నుండి బయటకి వచ్చిన కాసేపటికి మర్చిపోయే రేంజ్ క్యారక్టర్ అయితే నాగార్జునది కాదట. ఏళ్ళ తరబడి ఆయన ఈ సినిమాలో చూపించిన విలనిజం గురించి మాట్లాడుకునేలా ఉంటుందట. మరి ఆ రేంజ్ రోల్ పడిన తర్వాత ఇతర స్టార్ డైరెక్టర్స్ సైలెంట్ గా ఉండరు కదా, నాగార్జున ని భవిష్యత్తులో తమ సినిమాల్లో ఇలాంటి నెగిటివ్ రోల్స్ చేయించడానికి క్యూలు కడుతారు. అందుకు నాగార్జున ఒప్పుకుంటాడా?, లేదా కేవలం ఒకే ఒక్క ప్రయత్నం అన్నట్టు కూలీ తోనే ఆపేస్తాడా అనేది చూడాలి. ‘జైలర్ 2’ లో కూడా విలన్ క్యారక్టర్ కోసం నాగార్జున నే అడిగారట. ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకు ఆయన ఒప్పుకుంటే భవిష్యత్తులో నాగార్జున ని ఇలాంటి క్యారెక్టర్స్ లో చాలావరకు చూడొచ్చు.