Nagarjuna Coolie Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు (Lokesh Kanaka Raj)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకులను విపరీతంగా అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసి పెట్టుకున్నాడు. కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ఆయన రజినీకాంత్ తో చేసిన కూలీ సినిమాతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు. ఆగస్టు 14వ తేదీన కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఎక్స్ లో ఈ సినిమాకు సంబంధించిన ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అది ఏంటి అంటే బాహుబలి సినిమాలో బల్లాలదేవ్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నప్పుడు కార్మికులంతా దాని వెయిట్ మోయలేక వదిలేస్తారు. ఇక ఇలాంటి సందర్భంలోనే బాహుబలి వచ్చి ఆ విగ్రహాన్ని జనాల మీద పడకుండా కాపాడుతాడు. సేమ్ అలానే ఇప్పుడు కూలీ (Cooli) ట్రైలర్ విషయంలో కూడా అదే జరిగిందని చెబుతున్నారు.
Also Read: తమ్ముడు ఫేమ్ ‘అచ్యుత్’ గుర్తున్నాడా..? ఇతని అన్నయ్య ఇండస్ట్రీ లో స్టార్ హీరో..గుర్తుపట్టగలరా?
ఎందుకంటే కూలీ ట్రైలర్ డల్ అవుతున్న క్రమంలో నాగార్జున వచ్చి దాన్ని హై చేశాడు అంటూ చాలా మంది నాగార్జున అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం నాగార్జునను హైలైట్ చేస్తున్నారు. నాగార్జున వల్ల ఈ సినిమా మీద ఆ మాత్రం హైపైతే వచ్చిందని ఈ సినిమాతో నాగార్జున టాప్ లెవెల్లోకి విలన్ గా రానిచబోతున్నాడు అనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలియబోతున్నాయి…
ఇక ఈ సినిమాలో రజినీకాంత్ కంటే కూడా నాగార్జున క్యారెక్టర్ హైలెట్ కాబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. నాగార్జున క్యారెక్టర్ గురించి రజనీకాంత్ సైతం చాలా స్పెషల్ గా మాట్లాడటం వల్ల నాగార్జున క్యారెక్టర్ కి ఎక్కడ లేని హైప్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాతో ఆయన నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమాను నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…
Also Read: వారం కాకముందే ఓటీటీ లోకి ‘కింగ్డమ్’..ఎందులో చూడాలంటే!
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలందరు సూపర్ సక్సెస్ లో సాధిస్తున్న క్రమంలో రజనీకాంత్ సైతం ఈ జనరేషన్ లో ఉన్న హీరోలతో పోటీ పడుతూ భారీ విజయాన్ని సాధించి ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకుంటాడా లేదా అనేది ఇప్పుడు కీలకమైన అంశంగానే మారింది…
#Coolie trailler so so unna ni looks tho social media nee tagalapettesavu #King#Nagarjuna #Simon @iamnagarjuna pic.twitter.com/6Ht0TCpr6c
— Vamshi neerla™ (@Vamshi1043121) August 4, 2025